పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
        బిక్కిరింత పిదప వెక్కిరింత.
                                      టి. ఆర్మొగం.
     కవరువిప్పి జాబు చదువుకొంటిని.  సంతోషముతో "పాపాయీ, చూచినావా, రేపాదివారము కదా మంచిఅదృష్టము నీది" అని అఱచినాను.
    నాభార్య మొగమంత కన్నులతో నే చదువుచున్న న్యూసు పేపరు అవతలికి త్రోసి "ఏమది?" అని అడిగెను.
    "మాయబజారు చూదవలెనని అంగలార్చుచుంటివే. ఇదిగో, పెళ్లెగారు రెండు రిజర్వుడు టిక్కెట్లు పంపినారు."
    అమ్మయ్యా! మొన్నవారు వచ్చినప్పుడు ఈపాడుపిల్ల రాజేశ్వరి తటాలున, అడిగివేసినది. దానినోరున నాచేత మూసిపెట్టినాను కాని ఎట్లా అడిగివేసినదండీ. కాని, తేది ఏనాడని వేసియున్నారు?'
    "రేపు ఎట్లు వీలగును? రేపు రేడియోలో తనతమ్ముడు పాడుచున్నాడని వసంత మెరీనాబీచికి రమ్మన్నది కాదా. వత్తుమని మాటయిచ్చినాము కదా. పోకున్న ఆమెకడ సడిపడలే మండీ." అని తీర్మానము చేసివేసినది.
     నాకు కోపమువచ్చి బండమాట యేదో అన్నాను.
    "రామేశ్వరము పొయినా శనేశ్వరము వదలలేద్." అని పాపాయి కంటతడి పెట్టికొనెను.
    నాకది కష్టంగ ఉండెను.
   "ఏదోసాకుపెట్టి వసంత వారికి సమాధానము చెప్పరాదా?"
   "...  ...   .....   .....   .....   ....   ...  ....  ..."
  "పోనీ ఒకకార్డెత్తి నాకేదో జ్వరము తగిలినది రావీలులేక పోయి