పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురుషాపేక్ష కలిగినపుడు స్త్రీ కృశించును. రోగముచే గృశించియుండుటను ఋతు సమయముగా దలంపదగును. గర్భగ్రహణాపేక్షచే గృశించినదిగా నుండవలెను. సాధారణముగా సంధ్యలు కృశించియుండక బాగుగ బలసియుందురు. ఎచ్చటనైన నరుదుగ గృశించినవారు సంధ్యలుగా నుండవచ్చును. ప్ర్రాయశ:బలసియే యున్నారని తెలియుచున్నది. పుత్రసంతాన మపేక్షించువారు స్త్రీని నియతాహారముచే గృశింప జేయవలయును సంతానాపేక్ష గలవారు వ్రతోపవాసములు సలుపుట అశ్వత్ధ ప్రదక్షిణములు గావించుట నియ్హమంబుల నవలంబించుట మొదలగునవి గర్భ దారణకై స్త్రీని గృశింపజేయుట కేర్పఱుపబడినవని తెలియు చున్నది. ఈ పద్దతియే పశువులందును, వృక్షములందును, ననుసరింపబడుచున్నది. గొడ్డుటావులు మిగుల బలసి బిఱ్ఱు యిన శరీరములుగలవిగా నుండును. బిఱ్ఱు విడచి కడుపు జారునట్లుగా కృశింపజేనాయావును నాగటికిగాని బండికిగాని కట్టిలాగించెదరు. కొన్నిదినములు లాగిన తరువాత నది కృశించుటంజేసి కడుపు వదులగును. అప్పుడది గర్భము ధరించున్. వృక్షములు ఫలింపని గొడ్దుగా నుండునపుడు వనపాలకులు వాని వేర్లు, గాలియుండ తాకుట కనుకూలమగునట్లు త్రవ్వి కొన్నిదినములవఱకు మట్టితో మూయక యట్లనే విడచి నీరు కట్టకుందురు. అందుచే నా చెట్లు వాడి రాలిన యాకులు కలవియగును. అప్పుడు వానికిందగిన యెఱువున్ మట్టియుంగలిపిమూసి నీరు కట్టుదురు. తఱువాత చెట్టు వికశించి మంచిఫలముల నిచ్చును. ఈకారణమునుబట్టి స్త్రీ కృశించియుండుట ఋతుచిహ్నముగా నెఱుంగననియును పూర్వ మార్యులు స్త్రీలతో సంగమించుటకు సత్సంతానమే యుద్దేశ్యముగా గలిగియుండిరి. దేహసుఖమునకుగాను స్వేచ్చానుసారముగా విహరించుటకు గాదు.

  సంతానమునకుం బక్వమై ఫలవంతమగుటకు యుక్తమగు సమయము విశదముగా దెలియుటకు ననేకచిహ్నములు గనిపెట్టి నిషేకము గావింపవలయునని నిర్ధారణ చేసియున్నారు. గనుక పైచిహ్నములను గనిపెట్టి నిషేక కర్మ చేయుట మంచిది.
               -------