పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురుషమృగమును కూలపడును స్త్రీమృగమనుకూల పడనపుడు పురుష మృగము బలాత్కారము చేయదు. అట్లే మానవజాతియు నుండవలెను.

    ఇక్కాలంబున నట్లుగాక శాస్త్రవిధి నతిక్రమించి ప్రవర్తించుటవలన నల్పసత్వ అల్పాయుష్మంతమగు సంతానము గలుగుచున్నది.  దేహములో రోగము ప్రవేశింపగనే సమయమునకు స్వాభావికముగా గావలసినపదార్ధములను మితముగా నపేక్షించుటకును నైజముగానే యేకాలమందు విసర్జింపదగిన మలాదులను విసర్జింఫుటకు వలనుపడక కొన్నిపదార్ధముల నమితముగా నపేక్షించుటయు బదార్ధముల నెంతస్వీకరించినను దృప్తిజెందకుండుటయు గొన్ని యవశ్వక పదార్ధముల నపేక్షింపకయే యుండుటయు మొదలగు బాధలెట్లు సంభవించునో అట్టులే స్త్రీ పురుషౌలకుం బరస్పరాపేక్ష, సకాలమందు మితముగ గలుగక యకాలమందున మితముగ సంభవించును. ఆయపేక్ష నీడేర్చు కొనుటకు నాకార్య మెంతవిశేషముగా నొనర్చినను దృప్రిజెందదు.  తాపజ్వరము గాని దోషజ్వరముగాని సంభవించినవానికి దాహమమితము గాగలిగి యెంత యధికముగా నీరుద్రావినను దాహమణగనెట్లు వృద్ధియగుచున్నదో యట్లె కామ జ్వరము గలిగినవారికి నమిత కామాపేక్ష యునందుచే దృప్తిలేమియు సంభవిచు దున్నది. ఇవ్విధమున దేహపారిశుద్ధ్యము చెడికామజ్వర రోగంతో నిండిన స్త్రీలపేక్షించు నపుడెల్ల బురుషులనుకూల పడగూడరు.  పూర్ణారోగ్య ముగల స్త్రీకి గర్భ గ్రహణకాలమందుదప్ప పురుషుడు గామము సంబవింపదు.  అట్టి స్త్రీ కొరి నప్పుడు గర్భగ్రహణమునకు యుక్తకాలమని పురుషుం డనుకూలపడ వలయును. పురుషుండు పూర్ణారోగ్యవంతుండుగా నుండెనేని భార్యయందు గర్భ గ్రహణకాలమందుదప్ప యితరకాలమం దపేక్షింపడు.  స్త్రీ తనంతటనే యెపేక్షించి నంగాని పురుషుడు సంభోగింప కూడరు.  అట్లయి నపుడు ననరజస్వలలాపేక్షను సిగ్గువిడచి చెప్పుట యెప్పటికిని దటస్థింపదని కొందఱాక్షేపణ జేయవచ్చును. మన పేద్దలకిది తెలిసినవిషయమే.  కనుకనే యీ యపేక్షగలిగినపుడు స్త్రీలకుండు చిహ్నములను విశదపఱచి యా చిహ్నములు గలిగినపుడు నిషేకముగా నింపవలయునని చెప్పియున్నారు  "ఆచిహ్నములేవన"  మిగుల వాడి నిర్మలమైన ముఖమున అదరుచున్నకటి ప్రదేశమును స్తనములును వాలిన నేత్రములును జారిన కడుపునుగల స్త్రీని పురుషాపేక్షగల ఋతుమతిగ నెఱుంగవలయును.  ఇట్టి చిహ్నములు గలిగినతోడనే స్త్రీకి బుఋషాపేక్ష  కలిగినదని నిశ్చయించి గర్భాధానముం జేయవలయును.