పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఋ తు చి హ్న ము.

                       నావిల్ తోటమునిరెడ్డిగారు.
 ఋతువనగా గర్భ గ్రహణమునకు యుక్తకాలమందురు.  పదియారు సంవత్సరముల వయసునందు రజస్వలయైన మాత్రముననే గర్భాధానమునకు యుక్తకాలమని తలంసందగదు.  రజోదర్శనమగుట ఋతు చిహ్నములలో ముఖ్యమైన చిహ్నముగా నెన్నవలయు.  రజోదర్శన దినము మొదలు పదు నాఱుదినములు స్త్రీలకు ఋతుకాలము.  అందు మొదటి నాలుగు దినములును పంచ పర్వములును షష్థిస్యతీపాతము, శ్రాధదివసము వీనిని వర్జించి తక్కిన కాలమందు స్వధర్మ పత్నిని బొందవలయు.  ఈ మధ్యకాలంబున నిషిద్ధ దినంబుండిన విడువవలయు స్త్రీచే నపేక్షింపబడి స్త్రీని బొందవలయును. కాబట్టి స్త్రీ ఋతుమతియై యుండినను బురుషునం దభిలాష పుట్టువఱకు గర్భాధానము నకుంగాలము కాదని తెలియుచున్నది.
   ఇంద్రుడు తనకు నచ్చిన బ్రహ్మహత్యాదొషములో నొకభాగము స్రీలకుంబంచి నప్పుడు స్త్రీలాదొషము నంగీకరించి యింద్రుని గొన్ని వరంబులడిగిరి.  ఆవరము లలో నొక వరమెదన ఋతుకాలములో బ్రజను పడయుచున్నాము.  ఆప్రజమేము కామముతొగూడి యుండునపుడు మాత్రము కలుగునట్లు వర మనుగ్రహింపవలయునని స్త్రీలు ఇంద్రుని గూర్చి యడుగగ నతడు "అగుగాక" యని వరమిచ్చెను గనుకనే స్త్రీలు కామయుక్తలయి నపుడు మాత్రము సంతానము గలుగుచున్నది.
     పురుషుడు స్త్రీని బలవంత పెట్టికనయుటచే బీజము గర్భమందు నిలువదని నిశ్చయమగుచున్నది. శ్రుతులలోను స్మృతులలోను సూత్రములలోను స్త్రీకి రత్యపేక్ష గలిగినపుడు మాత్రము పురుషుండు సంపర్కముచేసిన చో గర్భమందు బీజము నిలిచి ఫలప్రదమగునని చెప్పంబడినది.  పురుషుండు స్వేచ్చాను సారముగా స్త్రీని బలవంత పెట్టికామాతురుడై పొందుటచే ఫలమించుకయులేదు. అట్లు పురుషుడు విధి నతిక్రమించుటతే స్త్రీగర్భగ్రహణకాలమందు మాత్రము పురుషు నందపేక్షగలుగు స్వభావంచెడియకాలమందును నతి ప్రబలముగా కామ ముద్రేకమగునట్లు చేయుననుటకు సంశయములెదు.  జంతుజాలములో సయితము స్త్రీమృగ మపేక్షించినపుడే