పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సవ్విషయములు బొధించుచు బాధగురుననిపించుకొనక బోధగురువువను కీర్తి నార్జించిరి.

     ప్రతివత్సరమున భాగవతపూజారంబమును తిరుమలయందుండు దివ్యతీర్ధ ములయందు శిష్యులతో సభజేరి వ్రతముగాసల్పుచుండువారు. వీరి యద్భుత చరిత్ర లెన్నియేనింగలవు.
    భవ సంవత్సర జ్యేష్టాషాఢ మాసములందు కొంత జబ్బుతో నుండిరి తదుపరి 15 రోజులుముందుగానే తన నిర్యాణసమయము కనుగొని తనకు ఎక్కువ శిష్యులుగలట్టి ప్రేమపూరితమైన రేపల్లెయందగు యెఱ్ఱేపల్లెయందు 10--7--33 తేది భవ ఆషాధ బహుళ తృతీయ సోమవారమునాడు బ్రాహ్మ్యముహూర్తమున శిష్యులజెరదీసిస్నానది కార్యములు చేసికొని భాగవత, గీతా పారాయణాదులు చేయించి అన్నియు పూర్తియైనదాయని ప్రశ్నించి అయినదను ప్రత్యుత్తరమువిని తాను కొంతపాలుమాత్రము సారణచేసి సిద్ధాసనమున నుండినట్లెయుండి ఉదయము 6 ఘంటలకు సిద్దిపొందిరి. శ్రీ స్వాములవారి శరీరము ఆనందనిలయమున సమాధికావింపబడియెను.  పూజాదికము, 19--8--37 లొ మండలాభిషేకము విష్యవర్గముచే జరుప బడియెను.
    వీరు మహామహులు. అనేక శిష్యగణములను తరింపజెసినవారు. వీరి యాత్మకు శాంతిగల్గునట్లు భగవంతుని ప్రార్ధించుచున్నాను.