పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమగ్రముగా నేర్చికొనుటమంచిదని తెలియకపోవునా? అదియు నాలోచించి నాడు కావుననే "నూఱువిధ్యలు నేర్చిన నక్క వేట కుక్క్లలచే జిక్కి బిక్కరించినది. ఒక్కవిద్యనే పూర్తిగానేర్చిన పిల్లి చెట్టెక్కి తన ప్రాణమును గాపాడుకొనిన" దని చిన్ననాడు చదివినకధను జ్ఞప్తికిదెచ్చికొనినాడు. దేనిని మనము పూర్తిగా నభ్యసింతమని దీర్ఘాలోచనకుదిగినాడు.

                              ---------
                            శ్రీరామా !
        కీ. శే. ఆర్ముగస్వాములు (కొండకుప్పం)
                                 A.  వీరభద్రపిళ్ళెగారు.
     శీర్ కరుణీకవంశమున పొన్నసాలికిచేరిన కొండకుప్పమను గ్రామకరణము గానుండిన షణ్ముగపిళ్లగారికిన్ నరమ్మగారికిని 1862 దుందుభినామ సంవత్సరము ఆని నెల 15 తేది గురువారమున జన్మించిరి.
    వీరు బాల్యదశయందు చాల తుంటరితనముగల్గి యుండిరట! అందుచే వీరు వేమనను మేలనిపించిరనిచెప్పుదురు. కొంతకాలము, కొండ కుప్పమునను కొంతకాలము పాచిగుంట గ్రామమునను కరుణెణీకము చేసిరి.
   ఆముదాల పుట్లూరు నివాసియగు వేలాయుధపిళ్లగారి కుమార్తెయగు ముని నాగమ్మగారిని వివాహమాడి సంతానము నిలువక చాలాకాలమున కొక పుత్రిక ను మాత్రము గాంచిరి.  కొంతకాలమునకు భార్యావియోగముకాగా తనకు 16 యేట ఉద్ధవునియొక్క 9 న శిష్యపరంపరలోజేరిన మహనీయునిచే ప్రసాదింప బడిన వేదాంతరహస్య విషయముల నభివృద్దిచేసికొనుచు అనేక దివ్యక్షేత్రములు సేవించుచు తిరువణ్ణామలై సాధుసంఘమునజేరి కొంతకాలముండి పిమ్మట తామార్జించిన జ్ఞానబీజముల భక్తుల మనంబులం బలవంతముగ జల్లి పెక్కుమతములందు అనేక శిష్యుల సంపాదించిరి.  అనేక