పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రవాత్సల్యమును గనబఱచినాడు. పాకశాస్త్రానుభవము గలవాడు గావున రుచిగలవంత సేయింపనెంచియు వైద్యవిద్య నెఱింగిన వాడగుటచే పసపులుసు వండించినాడు. సాముద్రికం నెఱిగినవాడుగావున దన యఱచేతిలో హలకులికాది రేఖలు లేవనిచింతించినను, బొటనవ్రేలియందలి గోదుమరేఖను గాంచి తృప్తిజెందినవాడు. నాట్యకలనెఱిగియుండుటచే జిత్ర నళీయంబున భాహుక పాత్రనుధరించి తన వికారరూపంబునకు సిగ్గుపడి నటించుటమానినాడు శకునశాస్త్రముపై దృష్టిగలవాడగుటచే మధ్యమాంసము లెదురుగావచ్చునను తలంపున బ్రయాణమగు నపుడెల్ల గల్లంగడిమార్గముననే పోవుచుండినాడు.

   రెట్టమతశాస్త్రము నొకప్పుడు చదువుకొనినవాడగుటచే తడిసిపొవలసి యుండునను తలంపున రాత్ర్రులందును గొడుగుచేతబట్టుకొని నడచుట కారంభించినాడు. జ్యోతిశ్శాస్త్ర పారంగతుడు కావుననే ప్రతిదినమును మీనమేష ములవలనిహలమ్ను స్మరించు?డు గూర్చుండినాడు.  యువకుడగుటచే గొక్కోక శాస్త్రమును జదువుటాతనికి స్వభావసిద్దమైనది గావున బద్మిమినీజాతి కన్య లంబించుటరుదని కాబోలు విహాహేచ్చయేవదలినాడు.  నీతిశాస్త్ర కుసలుండు గావున సేవకావృత్తి యనుచితమని రాజకీయోద్యోగముల గలలోససయితము విసర్జించినాడు.  స్వయంకృషిలాభకరియని చేతిపనులొనరింప బూనినాడు.  కాని, దేనియందును సుఖములేదని మానుకొనినాడు.  మట్టిపెళ్లలను సయితము గట్టివరహాలు గాజేయ్వచ్చునంకొని యింద్రజాలవిద్య నెంతోకష్టపడి నేర్చునాడు.  రసాయనశాస్త్రమో వనమూలిగాప్రభావమో కొంచె మెఱితిగినవాడు గావున దీరికయగు వేళలందల్ల స్వర్ణాపేక్షచే ననేకలోహములను గరిగి కరిగి పాడు చేయుచున్నాడు.  వేదాంతగ్రంధ పరిశీలనమో విరాగులస్నేహబలమో కాని ప్రాణాయామము సేయనుంకించియు మణిమాది సిద్ధులకొఱ కవస్దపడుచు న్నాడు. పరకా యప్రవేశవిద్య నభ్యసించుచున్నాడేమో కావుననే, గుప్త ప్రదేశము లందప్పుడప్పుడు పరుండి యూపేరిలిగబట్టి తల్లడిల్లుచున్నాడు. ఇంకను నేమేమి  సేయనున్నాడో! ఇన్నివిద్యలు నేర్చినాడేమిచేయజాలడు? చేయబూనిన నేది చేయగలడు? అన్నియు జేయగలడుకాని, యొక్కటియైన బూర్తిగా నెఱవేర్పగలడనుటకు సందేహింపవలసియుండును.  ఇన్నివిద్యలు నేర్చినవాని కేదేని యొక్క విద్యనైనను