పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేర్పడెను. అందువలన నీయన సమీపగ్రామమగు 'చీ ' యందు నివసింప దొడంగెను. అచ్చటి రాజుల ననేకమారు లీయన సందర్శించెను. కాని వారీయన కేవిధమగు సహాయమును చేయకుండిరి. తత్కారణమున తిరిగి స్వగ్రామమున కరుదేంచి యందే నివసింప జొచ్చెను., దాదాపు 50 వత్సరములచటనే యధ్య యన అధ్యాపకము లొనర్చుచుండెను.

'చీ ' రాజ్యము మిక్కిలి శోచనీయావస్థకు గాంచెను. మంత్రి ఇయాం హు సింహాసనము నధిష్ఠించుటకు బ్రయత్నించెను. 'లవో ' మోజే ' అను ఇర్వురు ఋషులును, కంఫ్యూషియాన్ కు సమకాలికులు. లావో అత్యుత్తమమగు నివృత్తి మార్గమ్ను ప్రచార మొనర్చుచుండెను. ఆయన మతానుసారము కర్మ యొనర్చ కుండుట వలనే సుస్థిరశాంతి లభ్యమగును. 'మోజే ' విశ్వప్రేమికుడు; మైత్రి ప్రచారకుడైయుండెను. కన్ఫూషియాన్ కర్మయోగి.

దేశదురవస్ను గాంచి, సహింపజాలక కన్ఫూషియాన్ దేశసేవాతత్పరు డాయెను. ఆయన దేశమందలి పురాతనవిషయముల నధ్యయన మొనర్చి ఇరు గ్రంధముల రచించెను. అతీతులు కీర్తిప్రతిష్ఠలను ఎల్లడించు గ్రంధములను జనసంఘమున నొసంగిన యెడల జనులు సన్మార్గవర్తనను లగుటవలన దేశమందు శాంతి నెలకొనునని యాయన మనోనిశ్చయము.

చివరకు విద్రోహలు క్రీ|| పూ|| 501 సం|| ఇయంహూ రాజ్యమునుండి పలాయనులైరి. తదనంతరము కన్ఫూషియాన్, యొక పట్టణమునకు గవర్నరా యెను. ఒక్క వత్సరకాలములోనే యాయన స్వకార్యములయందు సాఫల్య పండితు డగుటవలన, మరుసటి వత్సరమున రాజ్యమందలి ప్రధానవిచారక పదమందు నియుక్తుడాయెను. దేశదు:ఖము దూరీకృత మగుటకు రాజునకు మిక్కిలి సహాయమొనర్చెను. అందువల రాజున కీతనియెడల మిక్కిలి భక్తి శ్రద్ధ లేర్పడెను. పర శ్రీ కాతరులగు చుట్టుప్రక్కల రాజులు, కన్ఫూషియాన్ కును, రాజు-మంత్రికిని పరస్పర విరోధమును కల్పింపవలయునను నుద్దేశముతో నృత్య మొనర్చు వేశ్యలను రాజుకడకు బంపించిరి. రాజువేశ్యలతోగూడి మూడు దినములు దర్భారునకు రాకుండెను. అందువలన కన్ఫూషియాన్ నిరక్తచిత్తుడై క్రీ|| పూ|| 497 సం|| రాజ్యమును వీడి పరదేశముల కరగెను. శిష్యులతోడ నీయన పదమూడు వత్సరములు పర్యటనంబొనర్చెను.