పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్ఫూషియస్ ఋషి.

   జీ వి త ము - ఉ ప దే శ ము లు.
  క్రీ|| పూ|| 561 సంవత్సమున వర్తమానమందలి శాంతఢాయను ప్రదేశము నకు పశ్చిమభాగమందున్న 'చూ ' అను పేరుగల యొక గ్రామమునందు కన్ఫూషియస్ జన్మించెను.  ఆయన తల్లిదండ్రు లొసంగిననామము 'కుంచిఉ ' ఉపాధి 'టుంనీ ', కాని యాయన శిష్యగణము 'కుంపుజు ' నామమున నాయన ను పిలుచుచుండిరి.  కుంపుజు శబ్దార్ధము దార్శనికుడు లేక జ్ఞాని యని గ్రహింప నగును. ఈ పేరు క్రైస్తవ మిషనరీల యుచ్చారణయందు 'కన్ఫూషియస్ ' గా మారిపోయెను.
      

క్రీ|| పూ|| రెండువేల అయిదువందల వత్సరములకు పూర్వము చైనా సామ్రాజ్యమును ఇయానో, ఓశాన్, అను నిర్వురు చక్రవర్తులు ప్రతిష్ఠించిరను ప్రచారము కలదు. కాలక్రమమున నావిశాల సామ్రాజ్యము ఖండఖండములుగ విభక్తమాయెను. ఆసమయమందు 'చావో ' రాజవంశమువారి యధీనమున 'కన్ఫూషియాన్ ' నివసించుచుండెను. రోముసామ్రాజ్యమందలి జర్మనీదుర వస్థను బోలి అప్పుడు చీనా దురవస్థ దుర్భరముగ నుండెను. చావో, పరుల యధీన మందుండెను. రాజు బలహీనుడై మెలగజొచ్చెను. అప్పుడు తండ్రి సామాన్య మిలటరీ యాఫీసరై యుండినను కన్ఫుషియాన్ ఇన్-మహారాజ వంశమునుండి స్వీయవంశోత్పత్తికి గడంగియుండెడివాడు. 19 వ వత్సరమున నీయనకు వివాహమాయెను. ఒక పుత్రుడు, పుత్రికయు కలిగిరి. వివాహామైన కొలదిదినములకు రాజ్యసస్యాగారమున కధిపతిగ నియమింపబడెను. ఒక వత్సరము గడచిన పిమ్మట భూముల పరిపాలనా కార్యమునకు మార్చుటవలన నీతని పదవి యున్నతమాయెను. క్రీ|| పూ|| 527 సం|| ఈయన తల్లి మరణించెను. తదనంతర మీయన చైనాదేశీయులపద్దతి నను సరించి యుద్యోగమును వీడెను. అటుపిమ్మట యేవిధమగు ఉద్యోగమునకు గడంగక అధ్యయన, అధ్యాసనములయందు మనోనివేశమొనర్చెను. ఇందు వలన నీతని యశస్సు పలుదిక్కుల ప్రసరింపజొచ్చెను. అనేకు లీయన శిష్యత్వమును నంగీకరించిరి. 'చూ ' గ్రామమందు విద్రోహ