పుట:Telugu Samasyalu 1953.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
  • దుగ్గపయోధిమధ్యమున దుమ్ములు రేగె నిదేమి చోద్యమో.


ఉ. స్నిగ్ధపువర్ణుడీశ్వరుఁడు చిచ్చఱ కంటనుపంచబాణునిం, దగ్ధ
ము చేసె నంచువిని తామరసేక్షణుమ్రోలనున్న యీ, ముగ్ధ
పులచ్చి మోదుకొనె మోహనగంధము పిండిపిండియై. . .

  • ఈతాకులగుడిసెలోన నినుఁ డుదయించెన్.


క. సీతాపతిపూఁదోఁటకు
నేతా మెత్తేటివేళ యిప్పడె వచ్పెన్
పోతా పడుకున్నావా, యీతా. . . 108.

  • చూతుమె లవుఁడా యటంచు సుందరి పలికెన్.


క. సీత తన ప్రియతనూజని
నాతియుఁ జేరఁగఁ బిలిచి యౌరా యనుచున్
ఖ్యాతిగ రామునిగుఱ్ఱము, చూతు. . . 109.

  • విూనాక్షికిఁ గుచములాఱు మీనశరీరా.


క. సూనశరుఁడు నారసమునఁ
బూని కుసుముకందుకములఁ బొసగించె ననం _
గాను విలసిల్లె నంతయు, విూనాక్షి . . . 110

  • వర్షాకాలమువచ్చె గ్రీష్మమువలెన్ వైశాఖమాసంబునన్.


శా. హర్షం బెట్లగు కృష్ణదేవు డిటకై
          యబ్జాక్షిరాదాయె సా
మర్షాహుంకృతి చంద్రుఁ డేచుతఱి భీ
          మద్వేషనామోగ్రదు
ర్ధక్షక్రూరనిశాతఘాతనవచూ
          తవ్రాతబాణావళీ, వర్షాకాలము. 111