పుట:Telugu Samasyalu 1953.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



 

  • రాతిరివేళ భౌస్క_రుఁడు రమ్యముగానుదయించెఁదూర్పునన్


ఉ, వాతతనూజ! భానుసుత! వాలితనూభవ! వహ్ని పుత్రకా
సేతువుగట్టు కాల మిదె శీఘ్రముగా గొనిరండు కొండ లీ
రీతిగ నిద్ర బోఁదగదు లేండిక నిద్దర పోవఁ గానగున్, రా. . .

  • పసిఁడిసళాకు తీగెకును పర్వతముల్ వికసించి నవ్వగన్,


చ, విసువక పల్లవాళి దిని వేడ్క బికంబులు మ్రోయఁగావసం
తసమయహేమకారకుఁడు తద్దయు వేడుక భూపణంబులం బసవనలక్ష్మీంగూర్పుకొనభాసిలు సంపగిపువ్వు పేరి మేల్, ప. . .

  • ఆకులు పోకలుం గలుగ నంతియ చాలును సున్న మేటికిన్.


ఉ. శ్రీకర కీర్తిహార! గుణశేఖర! కొమ్మనమంత్రితిక్కనన్
రాకలుగోరి ముగ్దయును రాగము చెందినమన్మథాగ్నిచే
బ్రాకటమైనముత్యములు పాకములైనవి వేగలేవయా,ఆ...

  • ఏకాదశినాఁడు సప్త మేడేఘడియల్,


క.శ్రీకాంతునిదిన మెన్నఁడు
రాకొమరుని కెద్దిప్రియము రథతిథి యెన్నం
డేకొలఁదికన్నమఱుగును, ఏకా . . . 104

  • రమణికుచంబుమిద నొకరంపముకత్తియు రాజహంసయున్.


చ, సమురతి చేయు వేళఁ బతిసంధ్ర,మమంతయుఁజూచి యాత్మలో
గుములుమనంబుతోడుతను గూర్మి బయల్ పడనీక వేగవేు
కమలదళంబులో నిడిన కస్తురిచే లిఖయించి చూపినన్, ర. . . 105

  • రతి నేయఁగ రమణి నవ్వె రమణుం డేడ్సెన్,


క, సతియొక్క తె రేపల్లెను
బతితో రతికేళి నేయఁ బద్మాక్ష్ముడు దా
బతి నీడ్చి వేసి తానే, రతి నేయఁగ... 106