పుట:Telugu Samasyalu 1953.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ఉ. మానవనాథ! నీ వనుప వుత్తగజంబుల వేటఁ బోవఁగా, నే
నొకపర్వతంబుఁగనియొక్కఁ దొడంగినఁగుంజరంబుదా, బాను
కులేశమమ్ముగని పాఱ దొడంగినఁబట్టి తెస్తిమీ , యే. . . 83

  • కుందేటికిఁ గొమ్ములైదు కుక్కకుఁబో లెన్,


క.ముందిస్తి కుక్కపిల్లను
నందము గాఁ బసుపుకొమ్ము లయిదింటికిన్
పొందుఁగఁ గొను విూవిధమున, కుందేటికి. . . 84

  • వేకటి లేక బిత్తరియు బిడ్డ గనెన్ గగనస్థలంబునన్,


ఉ. మూకలు గూడి క్రౌంచములు ముందఱబోవుచు నుండ నొ
క్కటిం, జోకగ గుడ్లుఁబెట్ట నొకసూర్వకరం బిది దాఁకి పిల్ల
యై యీకలువచ్చితల్లి కడకేఁగ వడింజనెనైదునాల్నెలల్... 85

  • గుండప్పడు వడిగ నడిచెఁ గొమ్మలమీదన్.


క.మెండుగ శకపికశారిక
తండంబులు బలసికొలువ దళ వాయియువం
తుం డెదుట నడవన ననం, గుండప్పడు. . . 86

  • రాధేయుఁడు నందినెక్కి రావణుఁగూల్సెన్,


క.యోధ యొవఁడు కురు నేనకు
మాధవసఖుఁ డెద్ది నెక్కి మఱివిహరించున్
సాధించె నెవని రాముఁడు, రాధేయుఁడు. . . 87.

  • కుంజర యూధంబు దోమకుత్తుక చొచ్పెన్.


రంజన చెడి పాండవు లరి
భంజనులై విరటుఁ గొల్వ పాల్పడి రకటా !
సంజయ ! విధి నేవుందును, కుంజర యూధంబు. . . 88