పుట:Telugu Samasyalu 1953.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
  • అక్కా ! రమ్మనుచు మగఁడు నాలిం బలిచెన్,


● క. ఱక్కసివలె యిప్పొద్దున
మెక్కుచుఁ దిరి గెదవు కాలి మెట్టున నిన్నున్
గుక్కక మానను దసి నీ, అక్కా. - • 89

క.వక్కాకు మడిచి వేసుక
చక్కెరవిలు కానికేళిసలుపుద మనుచున్
చక్కనిముద్దులమఱఁద లి, యక్కా. . . 90

  • భార్యలిద్దఱు శ్రీరామభ ద్రునకును,


తే, రావణుని సంహరించియు రాజ్యమునకు
నంగనయుఁ దాను నభిషిక్తుడై వెలుంగ
హారతిచ్చిరి ప్రేమతో హరునిముద్దు, భార్య. 91

  • కోతికిని కొమ్ములారు గుఱ్ఱముకు వలెన్. ,


క, రాతిరొకహయము నమ్మితి
నాతురపడి హస్తికొమ్ములాఱింటికినిన్
ఈతఱిగొనుగో లిచ్చెద, కోతికినిం. . . 92.

  • నూఱున్ముప్పదియాఱుకన్నులమరెన్ రుద్రాణివక్షంబునన్.


శా. రారమ్మంచు గుమారునంకముపయిన్ రంజిల్లగానుంచి వి
స్తారోద్యద్ఘ నవక్త్రపంచకముతో శంభుడు దత్కాంతయు
న్నారూఢిన్ ఘనపంచరత్నపతకం బాలోకనం బేయగా . . . 93’

  • రుక్మిణిచనుమొనల విూద రోఁకలి నిలిచెన్


క. రుక్మిణిదేవిని నెత్తుక
రక్ష్మిణిపతి పోవుచున్నరూఢిగ నపుడే
రక్ష్మి యనువాఁడు తాఁకిన, రుక్మిణిచను. 94.