పుట:Telugu Samasyalu 1953.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
  • మరుఁడు దొనఁ జూపె యముఁడు కింకరులఁ జూ పె.


తే.భరతకులవీరుఁ డయినట్టి పాండురాజు
మాద్రిపై దృష్టి నిలిపిన మగువ యంత
వలదు వల దని వారింప వాంఛగరిమ, మరుఁడు. . . 77

  • ధారము లేనిహారము నితంబిని నీ కెవ రిచ్పెఁ జెప్పవే.


ఉ.భూరివివేకులౌవిటులఁ బూఁబొదరిండ్లను గూడివారిచే, గో
రినభూషణంబుఁ గొని కోమలి ధారుణి వైతివందులో, హీర
ము లుల్లసిల్లఁగ మహీప్రవరుల్ వినుతింపఁబచ్చలా, ధార . . .

  • కుంచములో పోతునక్క కూనలు పెట్టెన్,


మంచివి కుంచెడు సెనగలు
మంచముపై నెండఁబోసి మఱచితి నిపుడే
పెంచినది తల్లి యొక్కటి, కుంచ. . . 79

  • గుజ్ఞానికి రెండు కాళ్లు కోడికిని వలెన్,


క.మఱ్ఱికడ రెండు కాళ్లకు
కుఱ్ఱడు చో టడుగఁ గోడి కొనియిచ్చితినో
సఱ్ఱా జ అట్లు కా దిఁక, గుఱ్ఱాని

  • అనిరుద్దుఁడు నెమలి నెక్కి యంబుధి దాటెన్


మనసిజ నందనుఁ డెవ్వఁడు
అని షణ్ముఖు డెద్ది నెక్కి_యరుల జయించెన్"
హనుమంతుఁ డేమి సేనెను, అని, . . 81:

  • ఉత్తరమున భానుబింబ ముదయం బయ్యెన్,


క.ముత్తాళి నిదురఁ బ్రోవఁగఁ
దత్తరపడి నిదుర లేచి తమ్ముడ లేలే
చిత్తరువు వ్రాయఁబోవలె, ఉత్తర . . . 82

  • యేనుఁగుకొమ్ముమీదఁ బదియేనుఁగులున్నవి క్రీడ సల్పుచున్