ఈ పుట ఆమోదించబడ్డది
- పంచాస్త్రుని గేహమందు భానుఁడు వొడ మెన్
క.చంచలలోచన రాతిరి
సంచారముఁజేసినట్టిసందడిపడకో
పంచైన మూసికొనవే, పంచా. . . 47
- ఆణిముత్యంబు విూసమందమరియుండె,
క.చంద్రశేఖరుఁ డొక నాఁడు శైలపుత్రి
యధరబింబము చుంబించునవసరమున
గిరిజనాసాగమందున మెఱయుచున్న, ఆణి. . . 48
"కాంతామణి చంటిమీదఁ గాకర మెలచెన్
క.చింతామణి యను బాపఁడు
పంతంబున గోడ విూఁదఁ బ్రతిమను వ్రాసెన్
అంతట వర్షము గురిసెను, "కాంతా. 49
- కన్నులలోఁ జన్నులమరెఁ గాంతామణికిన్
క.చిన్నవి ఝషకంబులు గొని
చెన్నలరగ బెస్తవారి చిన్నది రాగా
పన్నుగ ఱొమ్మునఁ గలవల, కన్నుల. 50
- కన్నెరికము చెడకమును పె గర్బంబాయెన్
క.చిన్నది పండ్రైండేండ్లది
యెన్నఁడు రతికేళిసుఖము నెఱుఁగక
వెన్నున తామర పుట్టెను, కన్నె. . . 51
- కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్
క.చందనగంధులు ముగ్గురు
మందారపుఁదోఁటలోన మాపటి వేళ
న్నందంది పూలుగోయా, కుం. . . 52