పుట:Telugu Samasyalu 1953.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



  • మఱ్ఱాకున విడెము నేయ మనసాయెగదే,


క.కొఱ్ఱన్నము ఘృతసూపము
బఱ్ఱెలపెరుఁగూర గాయ పచ్చడితోడన్
బిఱ్ఱుగ భోంచే స్తిమాయా, మ. . . 41

  • మామిడి నిలువెల్లఁబూచి మారే డాయెన్ ,


కోమలినూతన వేళలను
చీమలు పదికోట్లు గూడి చిందులు దొక్కన్
మామా ! వూమిడిపూనెను, మా. . . 42

  • చూతుమె లవుడాయటంచు సుందరి పలికెన్,


క.ఖ్యాతిగలరామచంద్రుఁడు
చేతో వెూదంబుతోడఁ జెలఁగువు నెంతో
ప్రీతిగ నిటుచను దెంచిన, చూతు వెు. . . 43

  • వీపునఁ జండ్లుండు గోళ్ల వెండ్రుక లుండున్,


గోపాలకృష్ణమూ_ర్తిని
గోపికయొకనాఁడు ముందుగొని తలకురులన్"
బ్రాపుగఁ జిక్కులు దీర్పఁగ, వీపున. . . 44

ప్రాపని నమ్మినయొకసతి
కౌపేయముచేత వచ్చి కడుమోదముతో
రూపవతి పేలుచూడఁగ, వీపున, , . 45

  • చుక్కలలో నొక్క_నక్క సుడివడితిరిగెన్,


చక్కన గోవర్ధనగిరి
నక్కజముగఁ గృష్ణుఁడెత్త నావులకొఱకున్
గ్రక్కు-న గిరి మిన్నందిన, చుక్క 46.