పుట:Telugu Samasyalu 1953.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



 
ట్లార్తిం బొంద మిముం జయించు గద మున్నత్యుగ్రుఁడై దైత్యుఁడా, మార్తాండుం.

  • కప్పను జూడంగఁ బాము గడగడ వణఁకెన్.


కుప్పల కావలిలోపను
చెప్పులుకఱ్ఱయును బూని శీఘ్రముతోడం
జప్పు డగుచు వచ్పెడి వెం, కప్పను . . . 36

  • నిప్పున నొకచే రెఁండంత నెత్తురు గాఱెన్.

కుప్పించి వెలుగు దూకిన
గొప్పగుములు నా టె నిపుడు కోమలి వేగన్
ఉప్పగొని రావె కాతము, నిప్పన నొ. . . 37

  • రండాగమనంబుఁ జేయ రమ్యంబ యగున్",


కుండినపురమున రుక్ష్మిణి
చెండికకుం బూజనంబుఁ చేసెడి వేళన్
అండజవాహనుఁ దోడ్కొ_ని, రం డాగమ. . . 38

  • నెల బాలను జూచి బాల నెల బాలాయెన్


కలికీ! శిశు వెన్నాళ్ల దె
నెలకొని వివరింతు "రేపు నెలపొడపుగ దే
చెలి నీళ్లాడగమునుపటి, నెలబాల. . . 39

  • కమ్మలు మోకాళ్ల దాఁకి ఘలుఘలు మనియన్


కొమ్మను మదనుం డపుడు జ
వమ్ము న నీలోత్పలములవడిఁ గరియంగా
సొమ్మసిలి వెూను వంచిన, కమ్మలు. . . 40