పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొందడంవల్లనే ఈ సంగీతానికి కర్ణాటక సంగీతం, కర్నాటక సాంప్రదాయం అన్న పేరు నాటి నుంచి నేటి వరకూ దక్షిణ హిందూ దేశంలో అధిక ప్రచారంలో వుంది. విజయనగర రాజుల హయాములో దేవాలయాలలో దేవదాసీలు నృత్యాన్నీ, తద్వారా గానాన్నీ ప్రదర్శించే వారు. ఆ యా ఋతువుల ననుసరించి ఋతువర్ణనలతో ఒక్కొక్క ఋతువునకి ఒక్కొక్క రాగం పాడుతూ వుండేవారు.

రాయలు గానకళను ఎంతగానో పోషించాడు. సంగీత విద్వాంసుల్ని పోషించి వారికి అవ్వారిగా ధర్మాలను చేశాడు. అన్య రాష్ట్రాలనుంచి వచ్చిన అనేక మంది సంగీత విద్వాంసుల్ని ఆదరించి, గౌరవించి, సన్మానించాడు. ఇలా వచ్చిన వారిలో ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ పండితుడొకడు. ఈయన 'సంగీత సూర్వోదయ' మనే గ్రంధాన్ని వ్రాశాడు. ఈయన కొంత కాలం రాజాంత:పురంలో సంగీత శాస్త్ర అధ్యాపకుడుగాను పని చేశాడు.

రాయల బాటే రామరాజు బాట:

ఆశియ రామరాజు రామయామాత్యుడనే సంగీత విద్వాంసుని తన కుమార్తెలకు సంగీతం నేర్పటానికి నియోగించాడు. రామయామాత్యుడు 'స్వరమేళ కళానిధి' అనే ఒక ప్రమాణ గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాశాడు. ఈ గ్రంథాన్ని అనుసరించే కర్ణాటక సంగీత సాంప్రదాయాలన్నీ ఏర్పడినవట.

పుండలీకవిఠలు డనే ఆయన ఉత్తర హిందూస్థానం వెళ్ళి అక్కడ 'నర్తక నిర్ణయం. అనే నాట్యశాస్త్రాన్ని రచించి అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో గౌరవ సత్కారాల్ని పొందాడు

కృష్ణదేవరాయల సిబ్బందిలో ఒకడైన నాదెండ్ల గోపన్న మంత్రి ప్రభోద చంద్రోదయ మనే ఆధ్యాత్మిక రూపకానికి వ్యాఖ్య రచించాడు. అతడు నాట్యశాస్త్ర గ్రంథ కర్తలలో శృంగనాచార్యుని నామం రెండు మూడు మారులు ఉదాహరించాడు.

హరిహరరాయల కుమారుడైన 'విరూపాక్షరాయలు' విద్యారణ్య యతీంద్రుల శిష్యుడు. ఇతడు సంస్కృత భాషలో నారాయణ విలాసం, ఉన్మత్తరాఘవం అనే రెండు నాటకాలు రచించాడు.