పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
వైభోగం ఒలికే భోగం మేళాలు:

ఫేయస్ ఇంకా ఇలా వ్రాశాడు. భోగం స్త్రీలకు రాజభవనాలలో నిరాఘాటంగా ప్రవేశముండేదట. హజారరామాలయంలో వివిధ భూషణాలతో మురుస్తూ వున్న సానులను స్థంభాలపై తీర్చి దిద్దారట. వాటిని చూడగా కొంత మంది బిఱ్ఱులాగులు తొడిగి వాటిపై లంగాలను కట్టారట. దేవీ నవరాత్రులలో ప్రతి ఉదయం, భువనవిజయంలో, రథోత్సవాలు అన్నిటిలోనూ, దేవాలయాలలో ప్రతి శనివారమూ వారు నృత్యం చేయవసలిన వారై యున్నారట. నృత్యం నేర్పే గురువులకు రాయల వారు కొన్ని ఇనాములు ఇచ్చి యున్నారట.

వసంతోత్సవ వైభోగం:

నేటి హోలీ పండుగను రాయల కాలంలో వసంతోత్సవమని పిలిచేవారని మొదటి దేవరాయల కాలంలో విజయనగరం వచ్చిన నికోలో కాంటి ఉదాహరించాడు. ఆయన దానిని గురించి ఈ విధంగా వర్ణించాడు. వసంతోత్సవ దినాలలో వీథుల్లో ఎరుపురంగు నీరు ఉంచేవారట. వీథులలో వచ్చి పోయే వారందిరిపైనా ఎవరు బడితే వారు రంగు నీరు చల్లుతుండేవారట. చివరకు రాజు కానీ, రాణి కాని, అదారిన వెళ్ళితే చాలు అందరిపైనా ఈ వసంతం వర్షించిందన్నమాటే. ఈ వసంతోత్సవ కాలంలో అన్ని ప్రాంతాలనుండి కవులను రప్పించి వారి కవితలు విని ఆనందించి వారికి బహుమానాలు ఇస్తూ వుండేవారని ఆ పట్టణ వైభవాన్ని పరిపరి విధాల వర్ణించాడు.

కోలాటపు కోలాహలం:

క్రీ.శ. 1514 లో విజయనగరాన్ని సందర్శించిన బర్బోసా ఇలా వ్రాశాడు. రాయలవారికి ప్రతిదినం స్త్రీలే కడవలతో నీరు తెచ్చి స్నానం చేయించి, పాటలు పాడేవారట. చక్రవర్తి దర్బారులో కమ్మ కమ్మగా గానం చేశేవారట. అనాటి శిలా శిల్పాలలొ నృత్యాలు, వాద్యనాదనలు, కోలాటం మొదలైనవి కోలాహలంగా జరిగిన చిహ్నాలు కనిపిస్తాయి. ఆనాడు భోగం సానులు సంగీత విద్యలో ప్రత్యేక