పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/812

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమాషా, ఆరుబయలు రంగస్థలంలో మూడు వైపుల తెరువబడి వుంటుంది. విఘ్నేశ్వర ప్రార్థనానంతరం వాద్య బృందం వారు మంచి కోపులో పాటలను వినిపిస్తారు. తరువాత గోపీ నృత్యం వుంటుంది. ఇందులో సంవాదంతో కూడిన నృత్యాలు కొంతవరకు అసభ్యంగా వుంటాయి. సంగీత బాణీలు మంచి రక్తి నిస్తాయి. ఈ నాట్య బృందాన్ని 'ఫడ్ ' అంటారు. డప్పు తుం తుం న్యా, అనే వాయిద్యాలను వాయిస్తారు. మధ్య మధ్య లావణీకి సంబంధించిన శృంగార, వీర గీతాలను ఆలాపిస్తారు.

మహారాష్ట్రలో దీపక్ నృత్యమూ, లేజిక్ నృత్యమూ బహుళ జనాదరణలో వున్నట్లు డా॥డి.వై. సంపత్ కుమార్ నాట్యకళ జానపద కళల ప్రత్యేక సంచికలో ఉదహరించారు.

గోకులాష్టమి నాడు 'దహిబండి ' అనే నృత్యం చేస్తారట. దహి అంటే పెరుగు. పాలు, పెరుగుల దొంగిలించే శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన నృత్యాలు చేస్తారు.

లలిత ముద్ర అనే నృత్యాన్ని మధ్య యుగం నుంచి సంప్రాదాయంగా ప్రదర్శిస్తున్నారు. ఒకనాడు పౌరాణిక గాధలకే ప్రాముఖ్యం వున్నా, ఈనాడు దైనందిన జీవితంలో తారసిల్లే పాత్రలను దృష్టిలో పెట్టుకుని వ్వంగ్యంగా చిత్రిస్తున్నారు. లలిత మంటే నవ రాత్రికి జరిగే వుత్సవాలలో చేసే సంగీత కీర్తనలు.

అలాగే "గోంఘళ్" నృత్యాన్ని చేస్తారు. ఈ నృత్యాన్ని ప్రదర్శించే వారు 'గోంఘల్ ' అంటూ పాట పాడుతూ నృత్యం చేస్తూ, అంబా దేవిని ప్రార్థిస్తారు. వివాహ సమయాల్లో ఈ ప్రదర్శనాలను ఏర్పాటు చేస్తారు.

"ధోలానాచ్ " "దశావతార ", "తరవ", "కోలయానాచ్"(జాలరి నృత్యం) "రాధా నృత్యం", "దిండి" , "కూట", "తిప్రి", "గోప నృత్యం", "గౌరీ గణ పతీనాచ్", "బోహడ" అఏ జానపద నృత్యనాటకాలు, బాలికలు చేసే "పుంగడి"నృత్యాలు మొదలైనవి మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందాయి.

రాజస్థాన్

జానపద కళారూపాలకూ, జానపద నృత్యాలకు రాజస్థాన్ ప్రముఖ స్థానం వహించింది. రాజస్థాన్‌లో వివాహ సందర్భాలలో ఝోరియా అనే నృత్యం