Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/810

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంధం - అనుబంధం

ఆ యా రాష్ట్రాల జానపద కళా విన్యాసం

తరతరాలుగా ప్రజల నుర్రూతలూగించిన జానపద కళా రూపాలు ప్రజలలో ఎంతటి సంచలనాన్ని కలిగించాయో, అవి ప్రజా జీవితంలో ఎలా పెనపేసుకుపోయాయో, వారి వినోద విజ్ఞాన వికాసాలకు ఎంతగా తోడ్పడ్డాయో, క్రమానుగతంగా ప్రజాదరణ లేక ఎంతగా శిధిలమై పోయాయో ఈనాడున్న కళా రూపాలు ఎలా కృశించిపోతున్నాయో పైన వివరంగా తెలుసుకున్నాం.

అలాగే ఆయా సోదర రాష్ట్రాలలో ఆయా జాతుల, మతాల, భాషల, సాంస్కృతిక వ్వవహారాల కనుగుణంగా, ఆదిమ కాలం నుండి ఆధునిక కాలం వరకూ ఎన్నో జానపద కళా రూపాలు అభివృద్ది పొందాయ్హి. ప్రజలను ప్రభావితం చేశాయి. మన కళారూపాలను గురించి తెలుసు కోవడంతో పాటు, ఇతర రాష్ట్రాల కళారూపాలను గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.

కర్ణాటక:

మన ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తమిళ, కన్నడ, మళయాళ, మహారాష్ట్రా కళారూపాలకూ ఎంతో సారూప్యముంది. మన రాష్ట్రంలో వున్న కళారూపాలు కొన్ని కన్నడ రాష్ట్రాలలో వున్నాయి. అలాగే తమిళ నాడులో వున్నాయి. ఒకప్పుడు ఈ రాష్ట్రాలన్నీ ఒకే రాజుల ఏలుబడిలో వుండటం వల్ల, ఒకే రకమైన కళారూపాలు కూడా అభివృద్ధి చెంది వుంటాయి. అలా చూసుకున్నప్పుడు మన తోలుబొమ్మలూ, యక్షగానాలు, బుట్ట బొమ్మలూ, పాముల వాడి నృత్యాలు, కీలుగుఱ్ఱాలూ, హరికథలూ మొదలైనవి అనేకం వున్నాయి.

ముఖ్యంగా కర్ణాటకలో అత్యంత ప్రాముఖ్యత వహించేవి యక్షగానం, పురవి అట్టం, నంది కోళ్ కుణితి, వీరభద్ర కుణితి, రంగద కుణితి, వీరముఖల్ కుణితి, తూరి కుణీతి మొదలైనవి ముఖ్యంగా వున్నాయి. కుణితి అంటే నృత్యం. అలాగే 'గారుడి బొంబె ' అన్న కళా రూపం చాల ముఖ్యమైనదంటారు ప్రొఫెసర్ ఎస్. గంగప్ప గారు నాట్యకళ, జానపద కళల ప్రత్యేక సంచికలో