పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/808

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మించింది. అట్టడుగున పడి పోయిన ప్రాచీన కళారూపాల నన్నిటినీ సంస్కరించింది. ఆంధ్రనాటకరంగచరిత్రలో ఒక మహావిప్లవాన్ని తీసుకు వచ్చింది.

ప్రజానాట్యమండలి దోపిడి దారుల్నీ, సంఘ విద్రోహుల్నీ సంఘంలో పున్న కుళ్ళునూ, కళారూపాల ద్వారా, పాటల ద్వారా, నాటకాల ద్వారా కడిగి వేసింది. ఈ విధంగా అనతి కాలంలోనే ఆంధ్ర ప్రజలలో నూతన చైతన్యం కలిగించింది.

ప్రజానాట్య మండలి ఉద్యమం మహత్తరమైంది. దాని ఆశయాలు గొప్పవి. దాని పోషకులు ప్రజలు, ప్రజానాట్యమండలి ఆశయాలను, సంప్రదాయాలను దేశంలో అనేక సంస్థలు అనుసరించాయి.

అన్న తమ్ముల చీలికలు:

దీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిష్టు పార్టీ 1964 వ సంవత్సరంలో రాజకీయ విభేదాలతో చీలి పోయింది. కమ్యూనిష్టు పార్టీ, మార్కిస్టు పార్తీ, మార్కిస్టు లెనినిష్టు పార్టీ, నక్షల్ బరీ ఉద్యమంతో ఏర్పడిన నక్సలైట్లు, పీపుల్స్ వార్ పార్టీ పార్టీ ఇలా కమ్యూనిస్టు పార్టీ చీలికలై పేలికలై ఎన్నో శాఖలుగా విడిపోయారు. ఎవరికి వారు అన్ని రంగాలలోనూ వేరే వేరే సంబంధాలను పెట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి గాను, జననాట్య మండలి గాను, ప్రజా సాహితి గాను ఇలా ఎన్నో సాంస్కృతిక సంఘాలు ఏర్పడి అసలు ప్రజానాట్యమండలి విడిపోయింది.

అలాగే, ప్రజానాట్య మండలికి అండదండలుగా వున్న అభ్యుదయ రచయితల సంఘంలో కూడ చీలికలు వచ్చాయి. 1970 లో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మార్క్సిస్టులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్యమండలి జన సాహితి ప్రదర్శనాలు, పీపుల్స్ వార్ గ్రూపు, జననాట్యమండలి ఇలా గ్రూపులుగా చీలిపోయి, ఎవరి పాలసీకి తగిన విధంగా వారు పాటలనూ, కళారూపాలను సృస్టించుకుని పని చేస్తున్నారు. అందరూ అందరికీ కూడూ, గుడ్డా, వుండటానికి ఇల్లు కావాలనే వారే. దోపిడీ విధానం పోవాలనే వారే. అందరికీ సమానత్వం కావాలనే వారే. అందరి ఆశయాలు ఒకటే అయినా కలిసి పోయి పని చేసే విధానం ఎవరి తరుపునా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరికి వారై వారి వారి కార్యక్రమాలను సాగించుకుంటున్నారు.

ఇక్కడ నేను ఏ పార్టీని, ఏ సాంస్కృతిక ఉద్యమాన్ని విమర్శించ దలుచుకోలేదు. అయితే పూర్వ వైభవం మళ్ళీ పునరావృతం కావాలి. జాగృతి నుంచి మేలుకో