Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/807

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతిడే ముద్దమ్మ ॥నందాన॥
చెయ్యెత్తి దానాలు "

అంటూ భద్రాచల ప్రాంతాల నుండి వచ్చి యాచించి వెళ్ళిపోతూ వుంటారు చెంచులు. ఈ బాణీని అసరాగా అయ్యపు వెంకటకృష్ణయ్య దేశభక్తిని ప్రబోధిస్తూ

మనది భారత దేశమమ్మా ॥నందానా॥
మనది భారత జాతి తల్లీ "
భారతీయులము మనమమ్మా "
బానిసలమైనాము తల్లీ "
మన బాలచంద్రుడూ "
మన ఖడ్గ తిక్కన "
మన రెడ్డి రాజులూ "
తమ శౌర్యమయ రక్త "
ధారా స్రవంతిలో "
తడిసి మొదిపిన వీర "
ధాత్రి ఇది మాతల్లి "
మనది భారత దేశమమ్మా "

ఈ విధంగా ప్రాచీన జానపద కళా రూపాలను, ప్రజా పోరాటాల రంగ స్థలం ప్రజానాట్యమండలి పునరుజ్జీవింప చేసింది_ ఆ విధంగా _ బుర్రకథ _ జముకుల కథ _ హరికథ_ కోలాటం _ జంతరు పెట్టె _ చెంచీత పాట _ పకీర్లు _ సై సై నృత్యం _ గొల్ల సుద్దులు _ సోది _ పిచ్చి గుంటుల కథ _ వీథి నాటకం, డప్పుల నృత్యం_ డప్పుల కోలాటం _ చెక్క భజన,_ జేగంట భాగవతులు _ సమిష్టి నృత్యాలు_ బృంద గానాలు _ ఇలా ఎన్నో కళా రూపాలాలను ప్రదర్శించారు_ కొన్ని వందల దళాలు, వేలమంది కళాకారులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు_ ప్రజలలో చైతన్యాన్ని కలిగించారు.

ప్రజా నాట్యమండలి

ప్రజా నాట్యమండలి కళా రూపాలను కొన్ని లక్షల మంది చూశారు. ఆ నాటి తెలుగు జీవితంలో ప్రజానాట్యమండలి ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్ర