కళ కోసం కాదనీ, అది ప్రజలకు చెందిన ఆస్తి అనీ చాటింది. దేశంలో వచ్చిన రాజకీయ కల్లోల వాతావరణంలో రూపొందింది ప్రజానాట్య మండలి.
ఆంధ్ర నాటకరంగంలో అది వరకు ఏనాడూ కనీ వినీ ఎరుగనంత మహత్తర పరిణామాలను సృష్టించింది. గత చరిత్ర కంటే ఈ యుగం లోనే నాట్య కళ సంపూర్ణంగా ప్రజా సామాన్యం వద్దకు పోయిందని చెప్పవచ్చు. ప్రజల యొక్క స్థితి గతులకు అనుకూలంగా వారి కష్టాల్లో పాలు పంచుకుని పరిష్కార మార్గాలను కళారూపాల ద్వారా పరిష్కరించింది. ప్రజలు నాటక రంగాన్ని తమ కన్న బిడ్డను ఆదరించినట్లు ఆదరించింది ఈ రోజుల్లోనే.
- బానిసత్వపు రోజులు:
అవి బ్ర్ఫిటిష్ సామ్రాజ్య వాదుల బానిసత్వంలో మ్రగ్గుతున్న అరోజులు. ఒక ప్రక్క సత్యాగ్రహాలూ, శాసనోల్లంఘనాలూ, లాఠీచార్జీలు, జైళ్ళ కటకటాల మద్య ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు నానా బాధలు అనుభవిస్తున్న రోజులు, ప్రతి భారతీయుడూ అంతో ఇంతో జాతీయ భావాన్నీ దేశభక్తినీ కలిగి వున్న రోజులు. యువకులూ, విద్యార్థులూ, టెర్రరిస్టు విప్లవ భావాలతోనూ సోషలిస్టు భావాలతోనూ సమావేశ మౌతున్న రోజులు.
- ఉత్తేజం పొందిన యువకులు:
దేశం కోసం ప్రాణాలర్పించిన ఆనాటి వివ్లవ వీరుల జీవితాలను నుంచి ఉత్తేజం పొందిన యువకులూ, విద్యార్థులూ, స్వాతంత్ర్య పోరాటంలో పాల్కొనాలనీ దేశం యొక్క విముక్తికి పాటు పడాలనీ వేలాది యువకులు నాటి యువజనోద్యమంలోకి ఆకర్షింపబడ్డారు.
1933 లో ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ఆంధ్ర ప్రజాజీవితంలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంది. సోషలిజం స్థాపన లక్ష్యంగా రాజకీయ కార్యక్రమాలతో పాటు ఆంధ్ర జాతీయ పునరుజ్జీవనానికి బహుముఖ సేవ చేసింది. మితవాద కాంగ్రెసు విధానలతో విసిగి పోయిన యువకు లందరూ సోషలిస్టు భావాలతో కమ్యూనిస్టుపార్టీ వైపుకు మొగ్గారు.
పీడిత ప్రజాఉద్యమంతోపాటు కమ్యూనిష్టు పార్టీ సమాజ శ్రేయస్సు కాంక్షించడమే సాహిత్యం, కళల పరమావధి అనే ప్రగతి శీల దృక్పథాన్ని రచయితలలో