పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/793

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకం లాంటివి తప్ప ఎక్కువ జానపద కళారూపాల ప్రక్రియలను అనుసరించ లేదు.

ప్రగతిశీల విప్లవకవి కోగంటి గోపాలకృష్ణయ్య
పోరాట రంగ స్థలం, ప్రజానాట్యమండలి:

ఆ తరువాత జానప కళా రూపాలను ఒక మలుపు త్రిప్పి నూతన ప్రయోగంతో, నూతన దృక్పథంతో ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ నాటక రంగ స్థలంలో నవకాశాన్ని ఏర్పర్చి, ప్రజలను జాగృత మొనర్చి దేశభక్తిని రగులు కొల్పిన సంస్థ ప్రజా నాట్య మండలి.

రాష్ట్ర వ్యాపితంగా నిర్మించిన ప్రజానాట్య మండలి ఉత్సాహం కొద్దీ నిర్మించింది కాదు. అది ఒక ఉధృత వాతావరణంలో జన్మించింది.

కేవలం ఆర్థిక లాభాల కోసం నిర్మించింది కాదు. ఒక ఉన్నాతాశయ ప్రబోధంతో దేశానికి, ప్రజలకూ సేవ చేయటానికి పుట్టింది.