పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/795

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలిగించటానికి అభ్యుదయ రచయితల ఉద్యమం ద్వారా కృషి చేసింది. ఈ మార్పును కళారూపాలతో, నాటకరంగంలో సాంస్కృతిక రంగంలో కూడా తీసుకురావడానికి కమ్యూనిస్టు పార్టీ కృషి చేసింది.

రెండవ ప్రపంచ యుద్ధం.

రెండవ ప్రపంచ యుద్ధం పాసిష్టుల ప్రళయ అర్భాటాలతో మారు మ్రోగింది. ఫాసిష్టు శక్తులకూ, ప్రజాస్వామిక శక్తులకూ పోరాటమది. ధర్మానికి, అధర్మానికి, శాంతికి, అశాంతికి ఘర్షణ దినాలవి. దేశ దేశాల ప్రజలు అట్టుడికి పోయారు. మానవసమాజం యొక్క యుగ యుగాల విజ్ఞానం, సంస్కృతీ పశు బలానికి ఆహుతై పోతూవుంది. ఏ దేశమైనా, ప్రజలైనా, ఈ భయంకర మారణహోమం నుంచి ఈ అగ్నిజ్వాలల నుంచి బయట పడాలని తహ తహలాడే భయంకర దినాలవి.

స్పందించిన యువ చైతన్యం:
బెంగాల్ కరువు బుర్రకథ _నాజరు, పురుషోత్తం, రామకోటి

ఈ స్థితిలో కళాకారులూ, కవులూ, గాయకులూ ఈ హోమగుండం నుంచి ప్రజలను విముక్తి చేయాలకున్నారు. ఆనాటి యువకులందరూ వేయి కంఠాలెత్తి పిడికిళ్ళను బిగించారు. రాబోయే యుద్ధ ప్రమాదాన్ని గూర్చి దళాలు దళాలుగా బయలు దేరి ప్రచారం చేయ సాగారు. ఈ తీవ్ర సంచలనంలో ప్రతి కళాకారుడు దేశభక్తి ప్రపూరితుడై పోయాడు. కవులు గేయాలు వ్రాశారు. గాయకులు కంఠాలు ఎత్తారు. ఆంధ్ర ప్రజా సామాన్యాన్నంతా గాఢ నిద్రలోనించి మేల్కొల్పారు.