పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/790

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపయోగపడిన కళా రూపాలామేటి? అని మనల్ని మనం ప్రశ్నించు కుంటే మనకు కనిపించేవి ఆనాటి జానపద కళారూపాలే.

జానపద కళారూపాలంటే ఈనాడు చాల మందికి అర్థం కావు. జానపదమంటే పల్లెటూరని, జానపదంలో నివసించే వారు జానపదులనీ, వారు పాడుకునే పాటలు గానీ ఆటలు గానీ, నృత్యం గానీ, జానపద కళారూపాలని పెద్దలు నిర్వచించారు.

జానపద గేయాలనీ జానపద సాహిత్యమనీ, జానపద వీథి నాటకమనీ, తోలు బొమ్మలనీ, బుర్ర కథలనీ, పగటి వేషాలనీ, ఇలా ఎన్నో వందలాది జానపద కళా రూపాలు ఆనాడు పల్లె ప్రజలకు విజ్ఞాన వినోద వికాసాన్ని కలిగించాయి.

అంధ్రుల సాంఘిక చరిత్ర:

ఆంధ్రుల సాంఘిక చరిత్ర రెండు వేల సంవత్సరాల నాటిది. నాటి నుంచి నేటి వరకూ ఆయా రాజుల కాలాల్లో రకరకాలుగా ఈ జానపద కళలు ఆభివృద్ధి చెందాయి. శాస్త్రీయ కళలతో పాటు జానపద కళలు కూడా అభివృద్ధి పొందాయి. ప్రజలు ఆదరించారు.

శతాబ్దాలుగా రాజులు పోయినా, రాజ్యాలు మారినా జానపద కళలు మాత్రం ప్రజా హృదయాలలో అలాగే నిలిచి వున్నాయి. ఎన్ని ఆటు పోటులు వచ్చినా ప్రజలు వాటిని పోషించారు. కళాకారులను కన్న బిడ్డలుగా చూసుకున్నారు. తెలుగుజాతి గర్వించ తగిన కళారూపాలవి.

నాటకం, సినిమా, రేడియో, టెలివిజన్ లాంటి ఆధునిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటి పట్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించే వారు తగ్గి పోయారు. కళాకారులు కడుపు కోసం, కళలనే పట్టుకుని దేశ సంచారులుగా తిరుగుతూ కళా ప్రదర్శనాలను ప్రదర్శిస్తూ చాలీ చాలని ఆదాయాలతో కడుపు నింపుకుంటూ జీవిస్తున్నారు.

కాకతీయ ఉద్యమం, జాతీయ గీతాలు:

ప్రజా నాట్యమండలి ఏర్పడే నాటికి ముందే ఏర్పడిన వైజ్ఞానిక దళాలు, ప్రాచీన జానపద కళారూపాలను నూతన స్థాయిలో పునరుద్ధరించడానికి ముందే జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్వతిరేకంగా జాతీయ నాయకులు చేపట్టిన ఖాదీ కార్యక్రమమూ, రాట్నం వడకడమూ, సత్యాగ్రహ వుద్యమమూ, మద్యపాన నిషేధమూ, హిందీ వుద్యమమూ, గణేష్ వుత్సవాలూ మొదలైన ఉద్య