పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/791

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాలు చోటు చేసుకున్నాయి. తద్వారా ఆ వుద్యమాల ప్రచారానికి ప్రజల నాకర్షించి వారితో జాతీయోద్యమ భావాలు కలిగించాలనీ, అనేక మంది రచయితలూ, కవులూ, గాయకులూ, వారి కలాలనూ, గళాలనూ విప్పి ముందుకు నడిపించారు. ఆవిధంగా ఎన్నో గేయాలను వ్రాశారు. నాటకాలను వ్రాశారు. ప్రదర్శించారు. ఆ విధంగా వారంతా జాతీయోద్యమానికి ఎనలేని సేవలు చేశారు.

అకులందున అణగి మణగి కవిత కోకిల పలుక వలెనోయ్ అని గురజాడ అన్నట్లు, అతి నిరాడంబరుడైన స్వాతంత్ర్య సమర యోధుడు గరిమెళ్ళ, మాకొద్దీ తెల్ల దొరతనమూ అని, కొల్లాయి గట్టితే నేమీ మా గాంధి కోమటై పుట్టితే నేమీ అంటూ బసవరాజు అప్పారావు అగునా జీవాలు సాగునా లోకాలు, రాజుగా మన మెంచి రైతు చూడ పోతే అంటూ సెట్టి పల్లి వెంకటరత్నమూ, శివ శివ మూర్తివి గణ నాథా నీవు శివుని కుమారుడవు స్వామి నాథా అంటూ అబ్బూరి, తక్కెళ్ళ జగ్గని ధర్మ పన్నాలను, మాలపల్లి ద్వారా చెప్పించిన ఉన్నవ లక్ష్మీ నారాయణ, ఎగరాలి ఎగరాలి మన ఎర్రజండా అంటూ తుమ్మల వెంకట రామయ్య , ముద్దూరి అన్న పూర్ణయ్య, పి. లోకనాథం, గిరిరాజు రామారావు, వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరో తెల్పుడీ అనే త్రిపురనేని రామస్వామి పాటా మొదలైనవే కాక, రాయప్రోలు ఏదేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, దువ్వూరు రామిరెడ్డి, కాటూరు వెంకటేశ్వర రావు, కొడాలి ఆంజనేయులు. తుమ్మల సీతారామమూర్తి మొదలైన ఎందరో దేశ భక్తిమూర్తీభవించిన మహా కవులు, జాతీయతనూ, దేశభక్తినీ, రైతాంగాన్ని, కూలీలనూ ప్రబోధిస్తూ, ఆచార్య రంగా వెలువరించిన రైతు భజనావళిలో అసంఖ్యాకంగా గేయాలను వ్రాశారు. నాటి జాతీయ సభలలో అద్భుతంగా గానం చేశారు. ప్రజలను వుత్తేజపర్చారు. కార్యోన్ముఖులను చేశారు. ప్రజలను ఉద్యమ కార్య రంగంలోకి దూకేటట్లు చేశారు.

అలాంటి గీతాలను గురుజాడ రాఘవ శర్మ గారు ఆరువందల పేజీల గ్రంథంలో సమకూర్చారు. ఆనాటి ఉద్యమంలో వెల్లువగా వచ్చిన గేయాలనూ, పద్యాలనూ గీతాలను, భజన పాటలనూ, హరికథలుగా ఎన్నో సంకలనాలు 1922 లో వెలువడ్డాయి.

ఇలాంటి ఎన్నో గేయ రచనలు:

ఆనాటి ఉద్యమంలో వెల్లువగా వచ్చిన గేయాలనూ, పద్యాలనూ, గీతాలనూ, భజన పాటలనూ హరికథలుగా ఎన్నో సంకలనాలు 1922 లో ఈ క్రింద విధంగా