పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/789

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక రంగానికి మాతృకలై యుగ యుగాలుగా తరతరాల వైభవాన్ని సంతరించు కున్న జానపద కళారూపాలను గురించి, ఈ తరం వారికి చాలమందికి తెలియదనటం ఆతిశయోక్తి కాదు. అది తరతరాల వైభవం. తరగని వైభవం.

మన నాటక రంగానికి నూరేళ్ళు పూర్తి అయ్యాయి. అలాగే నాటకాలనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న సురభి నాటక రంగం ఏర్పడి కూడ నూరు సంవత్సరాలైంది. ఇటీవల చలన చిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవాలను జరుపుకుంది. ప్రాచీన జానపద కళారూపాలను పునరుద్దరించి నూతన ప్రయోగంతో ఆధునిక పద్ధతులలో ప్రజల మధ్యకు పోయి కళా రూపాలలో ప్రజా సమస్యలను జోడించి నవ చైతన్యం కలిగించిన ప్రజానాట్య మండలి ఏర్పడి నలభై ఆరు సంవత్సరాలైంది.

ప్రజానాట్యమండలి నిర్మాతల్లో ప్రముఖుడు డా॥రాజారావు
నూరు సంవత్సరాల ముందు:

అయితే నూరు సంవత్సరాల ముందు నాటక రంగం లేని నాడు మన ప్రజలకున్న కళా రూపాలేమిటి? వారంతా ఎలా జీవించారు. వారి విజ్ఞాన వినోద వికాసాలకు