పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కుని ఆదరించాడు. ఈ విధంగా ఆయన క్రీ.శ. 1350 వరకూ అజేయంగా పరిపాలించాడు.

TeluguVariJanapadaKalarupalu.djvu

ఆయన తరువాత క్రీ.శ.1366 లో ఆనపోతారెడ్డి రాజ్యానికి వచ్చి, పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన చాల శాసనాలు వ్రాయించాడు. బ్రాహ్మణులకు అనేక దానాలు చేసాడు. ఈయన తరువాతి రాజ్యాని కొచ్చిన వారు ఆయన కుమారుడు కుమారగిరి రెడ్డి. క్లుప్తంగా ఇదీ రెడ్డి రాజుల చరిత్ర.

రెడ్డిరాజుల కాలంలో సామాన్య జనులు దొమ్మరి సానుల ప్రదర్శనాలను, వీథి భాగవతాలను చూసి ఆనందించారు. సాతానులు ఏక తారలను చేత ధరించి శ్రావ్యంగా పాటలు పాడుతూ గ్రామాల్లో ప్రతినిత్యమూ యాచిస్తూ వుండేవారు.

ఆనాటి ఆటపాటలు:

ఆంధ్రరెడ్డిరాజుల యుగంలో అనేక వినోదాలు అభివృద్ధి పొందాయి. వాటిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించేవి ఆటలు, పాటలు, నాటకాలు.

ప్రజలు నాటకాలంటే ఎంతో అభిమానంతో వుండేవారు. ఎన్నో నాటాకాలు ప్రదర్శించేవారు. కాని ఒక్క నాటకంకూడ సంస్కృత మర్యాదలతో తెలుగులో వ్రాయబడలేదు. ఆనాడు వుద్దండులైన పెద్ద పెద్ద కవులు కూడా ఎక్కువగా యక్షగానాలనే రచించారు. అనాటికి ఉత్తర హిందూస్థాన మంతటా సంస్కృత నాటకాల ప్రభావం బహుముఖాల విజృంబించింది. నన్నయకంటే పూర్వమే దేశికవితా యుక్తమైన పాటల నాటకాలుగా యక్షగానాలు అభివృద్ధి పొందాయి. యక్షగానాల పుట్టు పూర్వోత్తరాలను గురించి మరోచోట ప్రస్తావించినా ఇక్కడ ఈ యుగంలోనూ వాటిని గురించి ఉదహరించడం అవసరమే.

జక్కుల పురంధ్రీకులు:

తెలుగు దేశంలో కామేశ్వర్యాది శక్తిదేవతలను గొలుచు జక్కులవారనే జాతివారుండే వారు. వీరినే అనేక మంది మన ప్రాచీన కవులు తమ గ్రంథాలలో జక్కుల పురంద్రీకులు అని వర్ణిస్తూ వచ్చారు. ఈ జక్కుల వారినే యక్షులుగా