Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాట్యకళను ఆరాధించిన రెడ్డిరాజులు

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం దానిని ఆశ్రయించుకున్న సామంత రాజులు, సేనానాయకులూ, స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. అటువంటి వాటిలో రెడ్డి రాజ్యాలు. వెలమ ప్రభువుల రాజ్యాలు ముఖ్యమైనవి. ఈ కాలంలోనె అటు విజయనగర సామ్రాజ్యం కూడ ఏర్పడింది. వీటిలో రెడ్డి రాజ్యమే ప్రాముఖ్యం వహించింది. రెడ్డి రాజులు ముఖ్యంగా అద్దంకి, కొండవీడు, రాజమహేంద్రవరము, కందుకూరు ప్రాంతాలలో క్రీ.శ. 1324 నుండి దాదాపు 1425 వరకు రాజ్యం చేశారు. వారి రాజ్యం కర్నూలు జిల్లానుండి విశాఖ పట్టణం వరకూ దక్షిణాన నెల్లురువరకూ విస్తరించింది.

కొండవీడు గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి కెక్కిన దుర్గం. దీని చుట్టు కొలత సుమారు ముప్పయి మైళ్ళుంటుంది. పర్వతాగ్రమే రెండున్నర మైళ్ళ వరకూ వుంటుంది. పర్వతాగ్రంలో మొత్తం 50 దుర్గాలవరకూ వున్నాయి. క్రింది భాగంలో వుంది కొండవీడు పట్టణం. ఆనాటి ఆ పట్టణం ఈ నాడు గ్రామంగా వుంది. శత్రుదుర్భేద్యమై చూచేవారికి ఆత్యాశ్చర్యం కలిగించే ఈ దుర్గం కాకతీయాంధ్ర చక్రవర్తుల కాలం నుంచి ముఖ్య రాజధానిగా విరాజిల్లడం వల్ల బహు ప్రాచీనమైనదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

రెడ్డిప్రభువుల దొడ్డతనం:

కాకతీయ సామ్రాజ్యంలో చివరివాడైన ప్రతాప రుద్రుని దగ్గర కోమటి ప్రోలయ రెడ్డి సేనానిగా వుండి మొట్టమొదటగా రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించి, అద్దంకిని రాజధానిగా చేసుకుని 1324 లో రాజ్యాన్ని పరిపాలించాడు.

ఆయన తరువాత రాజ్యానికి వచ్చిన వాడు ప్రోలయ వేమారెడ్డి. ఈయన చాల పరాక్రమం కలవాడు. పండితుల్నీ, కవుల్నీ, సన్మానించే వాడు. ఒంగోలు తాలూకా లోని చెదలవాడ వాస్తవ్వుడైన ఎర్రాప్రెగడ మహాకవి తన ఆస్తానంలో వుంచు