పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/784

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
అంపోలు _ఆడ్దవరం:

శ్రీకాకుళానికి నాలుగు మైళ్ళ దూరంలో ఈ రెండు గ్రామాలూ వున్నాయి. ఇక్కడ రంజకవరు అనే బుంజ వాయిద్య బృందాలు వుండేవి. ఈ వాయిద్యాలు శివ పార్వతుల కళ్యాణ సమయాలలో ఉపయోగిస్తారు. వీటి ధ్వని బ్రహ్మాండ మైనది. దీనిని ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణ జాతికి చెందిన వారు వాయిస్తూ వుంటారు. వీరు పుష్య మాసంలో ఆయా గ్రామాల వెళ్ళి వస్తూ వుంటారు. బుంజ కథను మరోచోట ప్రస్తావించటం జరిగింది.

బుంజ వాయిద్య కళాకారులు వి. ఆంజనేయులు, జంగం సత్య నారాయణ, మిరియాల కోటి లింగం, యస్.యస్. అప్పయ్య మొదలైన వారు.

విశాఖపట్టణం

విశాఖ పట్టణంలో ఎన్నో బుర్రకథ దళాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి కళామతల్లి బుర్రకథ బృందం, రామజోగి పేట, కొమరశ్రీ బుర్ర కథ దళం. వెంగళ రావు పేట, భవానీ బుర్ర కథ బృందం, కుమ్మరి వీధి కనక మహాలక్ష్మి బుర్రకథ దళం, న్యూ కాలనీ, అభ్యుదయ బుర్రకథ బృందం, సీతమ్మ పేట విశ్వేశ్వర బుర్రకథ దళం. ఇసుకతోట, నాయుడు మాస్టరు బుర్రకథ దళం, అనకాపల్లి శ్రీనివాసా బుర్రకథ దళం పని చేశాయి.

శ్రీ అప్పలదాసు ఇసుక తోట చుక్కాకుల సూరి బృందం, యస్, కోట మొదలైన బృందాలు జముకుల కథలు చెప్పాయి.

విజయనగరం:

అభ్యుదయ కళామండలి విజయనగరం కుమ్మరి మాష్టారు డి. ఎ. నారాయణ బుర్రకథలను జానపద కళారూపాలను ప్రదర్శించారు. సంపత్కుమారు బృందం