ఆంధ్రజాలరి తోపాటు జానపద కళారూపాలను ప్రదర్శించారు. ఇంకా రాఘవ కుమార్, కొంగలి సత్యనారాయణ మ్నూర్తి, రావు పట్నాయక్ బుర్రకథ దళం, గుండ్రా పద్మ నాభ వారు, రవి కుమార్ దళం _ సూర్య ప్రకాశ్ బృందం పని చేశాయి.
యండమూరి అమ్మాణి బృందం, సామ వేదం కోటేశ్వర రావు భాగవతార్, కొలచల ఇందిరా బాల మొదలైన వారు హరి కథలు చెప్పటంలో ప్రసిద్ధి చెందారు.
శ్రీకాకుళం జిల్లా
ఈ జిల్లాలో ఈ ద్రింది దళాలు బుర్రకథ దళాలుగా వర్థిల్లాయి. లలితకళా సమితి బృందం శ్రీకాకుళం అంపోలు లక్ష్మయ్య బృందం, పొందూరు రమణ శ్రీ బుర్ర కథ దళం, చీపురుపల్లి శ్రీనివాస కథా బృందం నరసన్నపేట.
- తూర్పు వీధి భాగవత బృందాలు:
కానేటి అప్పారావు నర్సీ పట్నం, కొచ్చెర్ల బ్రహ్మానందం లక్కవరపు పేట, ఆవల గాంధీ బృందం శ్రీ రాంపురం, రావుల వలస.
తూర్పు గోదావరి జిల్లా
ఈ జిల్లాలో పగటి వేష ధారులు, కోల సంబరం, వీర నాట్యం, తప్పెటగుళ్ళు మొదలైన కళారూపాలున్నాయి. కాకినాడ, మాధవపట్నం, సర్పవరం మొదలైన చోట్ల తోలు బొమ్మలాటల బృందాలున్నాయి. యం.వి.రమణ మూర్తి, కృష్ణమూర్తి తోలుబొమ్మలాటలో ప్రసిద్ధులు.
రాజమండ్రిలో వున్న విభూతి భవానీ లింగం పగటి వేషాలను ధరించటంలో ప్రసిద్దులు. వీరికి ప్రత్యేక బృందముంది. తూర్పు గోదావరి జిల్లా పగటి వేషధారుల సంఘాన్ని నడుపుతున్నారు.
అలాగే గజపతి నగరంలో తప్పెట గుళ్ళు బృందాలు, ద్రాక్షారామలో ఋంజ వాద్యకుల బృందముంది.