పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/779

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చెంగోల్, అల్లాపూర్, మంతన గౌడ, అగ్నూర్, కోటాబాసపల్లి, దందనెల్లి, పెడమాల్, బొబ్బారం గ్రామాలలో భాగవత దళాలు పని చేశాయి.

అలాగే షంకర్. రెడ్డి పల్లె, మంతన గౌడ, తట్టెపల్లి, పసహాపూర్ తండా, జైరాం తండా మొదలైన గ్రామాల్లో లంబాడీ నృత్యకారులున్నారు.

మెదక్ జిల్లా

మెదక్ జిల్లాలో భాగవత దళాలూ, చిరతల రామాయణం ప్రదర్శించే సమాజాలు, కోలాటం మొదలైన జానపద కళారూపాలను ప్రదర్శించే బృందాలు విరివిగా వున్నాయి.

TeluguVariJanapadaKalarupalu.djvu

సంగారెడ్డి లో జడకోపు కోలాట సమాజాలు, వీథి భాగవత దళాలు విరివిగా వున్నాయి. సదాశివ పేటలో భాగవత దళాలను పడిగి నారాయణ, మారేపల్లి యజ్ఞ నారాయణ మొదలైన కళాకారులు నిర్మాణాయుతంగా నడుపుతున్నారు. శ్రీ గోవింద దాసు ఆధ్వరంలో మూడు చిరుతల భజన సమాజాలు నడిచాయి. మారేపల్లి, సూరారం, నందికుండి, నిజాంపూర్, వెంకటపూర్, తంగదంపల్లె మొదలైన గ్రామాల్లో కూడ చిరుతల రామాయణం భజన సమాజాలు నడిచాయి. ఈ సమాజాల్లో రామకృష్ణ, శంకర రావు, నరసింహా రెడ్డి మొదలైన కళాకారులు పని చేశారు.

జహీరా బాదు తాలూకా బిలాల్ పూర్ లో ఒక బుర్ర కథ దళం పని చేసింది. కోహిర్, ముగుదం పల్లి, అజాద్ గంజ్, దిగ్వాల్, రంజోల్, చీరిక మొదలైన