పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/780

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గ్రామాల్లో వీథి భాగవత దళాలు, తోలు బొమ్మల దళాలు సమర్థ వంతంగా పని చేశాయి.

బిలాల్ పూర్, కోహిర్, రంజోల్ మొదలైన గ్రామాలలో చిరుతల భజన సమాజాలు నడిచాయి.

మీర్జాపూర్ దగ్గర నున్న రామ గుండం, చిటికుర్తి గ్రామాల్లో భజన సమాజాలు నడిచాయి. వామన పల్లి, సిద్దపూర్, దోనపల్లి, మొదలైన గ్రామాల్లో లంబాడి నృత్య దళాలు పని చేశాయి.

జోగి పేటకు దగ్గరలో నున్న కనకం పల్లె, పెదపూర్, తికమల్ , రామన్న పేట గ్రామాల్లో భాగవత దళాలు పని చేశాయి.

కనకం పల్లి, పెదపూర్ గ్రామాలలో చిరుతల కోలాటం సమాజాలు నడిచాయి. వాసుదేవ, ఆదెప్ప మొదలైన వారు పని చేశారు.

నిజామాబాద్ జిల్లా

TeluguVariJanapadaKalarupalu.djvu

నిజామాబాదుకు నలభై మైళ్ళ దూరంలో వున్న బన్స్ వాడలో భీమశాస్త్రి హరికథ చెప్పడంలో ప్రసిద్ది వహించారు. అచ్చం పేటలో శ్రీనివాస రావు కోలాట సమాజాన్ని రైతు నగర్లో పొట్లూరి వీర భద్రం, రంగ నాయకులు, ఒక భాగవత సమాజాన్ని నడిపారు.

బిరకూర్, మొహద్ నగరాల్లో భజన పార్టీలు పని చేశాయి. బిరకూర్, పిట్లాం గ్రామాల్లో బుర్ర కథ దశాలు పని చేశాయి. దుకి, తడికేల్, తిరుమల పూరుల్లో కూడ వీథి భాగవత సమాజాలు పని చేశాయి.