పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/778

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాల్లో బి. రంగా రెడ్డి, ఘటం సత్యనారాయణ, మల్లా రెడ్డి, బుగ్గా రామదాసు, చంద్రశేఖర శర్మ మొదలైన వారు పని చేసారు.

పెడమాల్, గోవిందరావు పేట గ్రామాల్లో బుర్ర కథ దళాలూ, చెంగోల్, అల్లిపూర్_అగ్ నూర్_కొత్త బాసపల్లె_కంద నెర్లి, పెడమాల్, బొబ్బారం గ్రామాల్లో భాగవత దళాలున్నాయి.

శంకరరెడ్డి పల్లి, మంతన గౌడ, తట్టి పల్లి మొదలైన చోట్ల లంబాడి నృత్య దళాలు పని చేశాయి.

రాంపల్లి, దుల్ పల్లె, అలియాబాద్, తురకపల్లి, యద్గపల్లె-భుమర పల్లి, దుండిగాల్ మొదలైన చోట్ల బుర్రకథ దళాలు పని చేశాయి.

అలాగే రాంపల్లె, దుల్ పల్లె, మేడ్ చల్, పౌదూర్, యంజాల్, అలియా బాద్, యాదరం, యద్గరపల్లె, కీసర కొసహైగుడ, వడ్డెమర్రి, దుండిగాల్ మొదలైన గ్రామాలలో భజన సమాజాలు పని చేశాయి.

చుట్టు ప్రక్కల గ్రామాలైన మెయిన్ పేట, పొట్లూరు గ్రామాలలో బుర్ర కథ దళాలు, శిరిపూర్ గ్రామంలో హరిదాసులూ, హరికథా గానం చేసే వారూ వుండే వారు.

తాండూరు చుట్టు ప్రక్కల గ్రామాలైన చెంగోలి, గోనెల్లి, మిట్టబాస పల్లి, కోడబాస పల్లి, అల్లాపూర్, మంతన గూడ, అగ్నూర్, గోవింద రావు పేట, మంబాపూర్, రుక్మాపూర్, పెద్ది మాలకండ నెల్లి, బ్రిధారమ్, బొబ్బారం మొదలైన పల్లెలలో చిరుతల భజన, కోలాట దళాలు పని చేశాయి.

బుద్దారం, పెద్దమాల్, గోవింద రావు పేటలలో బుర్ర కథ దళాలు పని చేశాయి.