Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/776

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగవత దళాలు, శంకరరెడ్డిపల్లె, మంతనగౌడ, తట్టిపల్లి మొదలైన గ్రామాలలో లంబాడినృత్య దళాలు పనిచేశాయి.

వనపర్తిలో సంగీత శాఖలతోపాటు దగ్గరలో వున్న గోపాల పేటలో తోలుబొమ్మలాట వారున్నారు. వనం శేషాచార్యులు, పాపయ్య, టి.గోపాల్ -శ్రీమతి రాధమ్మ - వెంకట రామారావు మొదలైన కళాకారులుపనిచేశారు.

జడచర్లలో భారత సంగీత నాటక కళాశాల నడిచింది. దగ్గరలోనున్న కలువకుర్తిలో భజన సమా‌వేశాలు పనిచేశాయి. అచ్చంపేటలోనూ, అమరాబాద్‌లోను చెంచుల నృత్య దళాలు పనిచేశాయి.

హైదరాబాదు

1956ప్రాంతంలో గిరిజన నృత్యశాఖను గోపాల్‌రాజ్‌భట్ స్థాపించారు. ఈ సంస్థలో అధ్యక్షులుగా కాళోజీ నారాయణరావు పనిచేశారు.

ఏభై సంవత్సరాల క్రితం గగన మహల్ రోడ్‌లో ఒక యక్షగాన బృందముండేది. అలాగే గౌలిగూడాలో శ్రీరామారావు ఆధ్వర్యంలో చిరుతల రామాయణ దళం పనిచేస్తూ వుండేది.

నాంపల్లిలో ఒక కోలాట బృందం, ఒక ఒగ్గుకథ బృందం వుండేది. ఆ బృందంలో కందస్వామి, రఘు, రాఘవులు ముఖ్య కళాకారులుగా పనిచేసేవారు.

హైదరాబాదు జిల్లా

హయత్‌నగర్ లో లోగడ చిరుతల రామాయణం జడకోపు కోలాట సమాజాలు పనిచేశాయి.

ఈ సమాజంలో పుఱ్ఱా సత్తెయ్య, యస్. వెంకటాద్రి, హనుమంతయ్య, రత్నమాచారి, వెంకోబారావు, ఏ.రాజయ్య, ఆకుల వీరయ్య, జనగామ శంకరప్ప, తిరుపతి మొదలైన వారు పనిచేశారు.

నెత్నూర్, రాజలూరు, తిమ్మాపూరు మొదలైన ఇబ్రహీం పట్నం చుట్టు ప్రక్కలున్న పై గ్రామాల్లో యక్షగాన, భజన సమాజాలు పనిచేశాయి.

మేడిచల్ చుట్టుప్రక్కల గ్రామాలైన రాంపల్లి, ఆలియాబాద్, తురకవల్లి, మరపల్లి, దుండిగల్ మొదలైన గ్రామాల్లో బుర్రకథ దళాలు పనిచేశాయి.