పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/775

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేషధారు లుండే వారు. ఒకప్పుడు ఎన్నో జంగాల బుర్రకథ దళాలు, గొల్ల భాగవతులు, మాల భాగవతులు, సంగెగెడ్డలో ఎంతో మంది దేవదాసీ కళాకారిణులు వుండేవారు.

మహాబూబ్‌నగర్ జిల్లా

వుప్పేరు, ఇది గద్వాలకు దగ్గరలో నున్న చిన్న గ్రామం. ఇక్కడ "బయలు నాటకాలకు" కోలాట సమాజాలకు ప్రసిద్ధి.

బయలు నాటకాలు "నెక్కటపల్లి" గిట్టూరు మొదలైన చోట్ల "కట్టెల కోలాటం", చెక్క భజన సమాజా లున్నాయి. పెద బసవయ్య, వడ్ల వెంకటరామయ్య పేరు పొందిన కళాకారులు.

జడచర్ల దగ్గరలో వున్న అచ్చంపేటలోనూ, అమరబాద్‌లోనూ, చెంచుల నృత్యదళా లున్నాయి. కోలాట దళాలు విరివిగా పని చేశాయి.

సినిపూర్ లో హరికథలు చెప్పేవారున్నారు. మెయిన్ పేట, పుట్లూ గ్రామల్లో బుర్రకథ దళాలు పని చేశాయి.

చెంగోల్, గోనెల్లి, మిట్టా బాసపల్లె, కోటబాసిపల్లి, అలంపూరు, అగ్ నూరు, మంచాపూర్, పెద్ది మాల్, కందనెల్లి, బొప్పారం గ్రామాల్లో చిరుతల భజన, కోలాట దళాలు పని చేసాయి.

పెడమాల్, గోవిందరావుపేట గ్రామాల్లో బుర్రకథ దళాలు, చెంగోల్ అల్లి పూర్, అగ్ నూర్, కొత్త బాస పల్లి, కందనెర్లి, పెడమాల్, బొప్పారం గ్రామాల్లొ