పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/774

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సమాజంలో మరెందరో సహాయ నటులు ఆయా పాత్రలను పోషిస్తూ హంగుదారులుగా వారి నాటక సమాజాన్ని మకుటాయమానంగా నిర్వహిస్తున్నారు.

కర్నూలు జిల్లా


ఈ జిల్లాలో ఒకప్పుడు పోతకమూరి భాగవతులు ప్రసిద్దంగా వీథి నాటకాలను ఆడారు. కోటకొండ కపట్రాల గ్రామాలలో చల్లావారు కూచిపూడి పద్దతిలో బనగానపల్లి నవాబుల ఆవరణలో రాయలసీమలో భాగవత కళను ప్రచారం చేశారు. మరెన్నో బయలు నాటకాలు దళాలు పని చేశాయి.

నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో యానాది జాతి వారెక్కువ. వారిలో ఎంతో మంది ఉత్తమ కళాకారులు వుద్భవించారు. పాటలు పాడటం నృత్యాలు చేయడం, పౌరాణిక గాథలకు సంబందించిన అనేక భాగవత నాటకాలను వీథి నాటకాలుగా ప్రదర్శించారు.

గుంటూరు జిల్లా

ఒకప్పుడు ఈ జిల్లాలో కీలుబొమ్మలాటలవారు విరివిగా వుండే వారు. వేట పాలెంలో వీధి నాటక కళాకారులైన గట్టి వెంకట శివయ్య, గూరాబత్తుని వెంకటేశ్వర రావు. పి. మాణిక్యం, పాలగారి వెంకటేశ్వరరెడ్డి, యం. ఆంజనేయశర్మ మొదలైన వారుండేవారు. గుట్టి వెంకటశివయ్య బుర్రకథ దళంగానూ, దొడ్డారపు వెంకటస్వామి మేనల్లుడు యల్లమంద జంగం కథకుడు గానూ, తమ్మారపు వెంకట స్వామి వీథి నాటకాలను ఆడేవారు. దొడ్డారపు వెంకట స్వామి ఆ రోజుల్లో గొప్ప జంగం కథా గాయకుడుగా వెలుగొందాడు.

కృష్ణా జిల్లా

కూచిపూడి భాగవతుల యక్షగానాలు, వీథి నాటకాలు ప్రదర్శించారు. ఎంతో మంది పగటి వేషధారులుండేవారు. అలాగే గడ్డిపాడులో ఎంతోమంది పగటి