Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/767

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వార్లూ జరుగుతూ వుంటాయి. వీరు చెప్పే కథా సాహిత్యం ఎటువంటిదో మనకు తగిన ఆధారం గ్రంధారూపంగా లభించదు. వీరి వాయిద్యాలలో డోలు ప్రసిద్ధి చెందిన వాయిద్యం. ఇంకా వీరు ఉపయోగించే వాయిద్య విశేషాలలో ముఖ్య మైనది "జమలిక". దీనినే జవనిక, జముకు అని పిలవడం కూడా కద్దు. వీరి మరొక వాయిద్యం తుడుం కొమ్ము. వీరిని కొన్ని ప్రాంతాలలో రోజ వారని కూడా పిలుస్తూ వుంటారు.


బాల సంతు వారు

సర్కారాంధ్ర దేశంలో బాల సంతు వారు ఎక్కడా కనిపించకపోయినా, రాయలసీమ తెలంగాణా జిల్లాలలో వీరు ఎక్కువగా కనిపిస్తారు. వీరు వీరగాథల్ని గానం చేస్తారు. వీరిని బాల సంతోషం వారనీ, బాల సంతు వాళ్ళనీ పిలుస్తారు. కర్నూలు ప్రాంతంలో వీరు బొబ్బిలి కథనూ, నవాబుల కథలనూ గానం చేస్తారు.

ప్రారంభంలో వీరు గంగా గౌరి సంవాదం వంటి శైవ కథల గానం చేసే వారు. తెల్లవారు జామున గంట వాయిద్యంతో గ్రామీణులను మేల్కొలుపుతూ ప్రతి ఇంటికీ వెళ్ళి జోస్యం చెప్పి వెళ్ళి పోవటం కూడ వీరి కార్య క్రమం. తరువాత వారిచ్చిన పారితోషికాన్ని పుచ్చుకుంటారు. ఈ కార్యక్రమమంతా గ్రామస్తులను వినోదపర్చేది.


మాక్టీలు

మాక్టీలని వీరికి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, వీరు కథాగానంలో మాలల్నీ, మాదిగల్నీ, గొల్లల్నీ యాచించి బ్రతుకుతూ వుంటారు. వీరిని మాల మాక్టీలని కూడ పిలుస్తారు. వీరు దొమ్మరి వారి లాగే అంగ విన్యాసాలతో పాటు సాము గరిడీలను నిర్వహిస్తారు. ఆనాడు గ్రామీణ ప్రజలకు ఇంతకంటే వినోద కార్యక్రమమేముంది?


గరుడ స్తంభం దాసరి

శంఖం, జేగంట, దీపపు సెమ్మా, రాగి చెంబు, హనుమంతుడు బిళ్ళ అనే అయిదు గుర్తులతో యాచించే గాయకులను దాసరు