పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/766

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ భాగవత దళం విజయాగరం ఆనెగొంది రాజ నగరాల్లో నాటకం ప్రదర్శించి నప్పుడు ఆ మేళ గాండ్రలో అంద గాడైన ఒక స్త్రీ పాత్ర ధారిని ఆనాటి రాజుగారి సోదరి వలచి వలిపించి అతనితో సాంగత్యం జరిపినట్లు ఒక ఇతి హాసముంది. దీనిని బట్టి ఆ భాగవత దళం ఎంత వుత్తమమో తెలుసుకోవచ్చు.


సింహాద్రి అప్పన్న సేవ

TeluguVariJanapadaKalarupalu.djvu

విశాఖపట్టణానికి అతి సమీపంలో వున్న పుణ్యక్షేత్రం సింహాచలం. సింహాచలక్షేత్రంలో ప్రసిద్ధమైన వరాహ నరసింహస్వామి దేవాలయం వుంది. దీనినే సింహాద్రి అప్పన్నకొండ అంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి మొదలైన జిల్లాల ప్రజలకూ అటు ఒరిస్సా ప్రజలకూ ఆరాధ్య పుణ్యక్షేత్రం సింహాచలం.

దేవుడికి పూజ చేయటమే సేవ, సింహాచల క్షేత్రానికి మ్రొక్కు బడులు చెల్లించటానికి వచ్చే ప్రజలు ఆచరించేదే సింహాద్రి అప్పన్న సేవ.

వరాహ నరసింహ స్వామిని కీర్తిస్తూ కథకుడు నల్లని వెండి పొన్నుల కర్రను చేతిలో ధరించి మరో చేతిలో నెమలి ఈకల కుంచెను పట్టుకొని కథను చెపుతూ వుండగా తనకు వంతగా వున్న భక్తులందరూ పెద్ద పెద్ద తాళాలను చేతపడతారు. అందరూ జరీ అంచుగల తలపాగలను ధరిస్తారు. బృందంలోని మరి కొందరు నూనె గుడ్డలను చుట్టిన కోలలను వెలిగించి పట్టుకుంటారు. ఈ కోలల వెలుగులో పెద్ద తాళాలను మ్రోగిస్తూ బృందం వలయాకారంగా తిరుగుతారు. ప్రధాన కథకుడు చరణం పాడితే, వారి దానిని వంతగా అనుసరిస్తారు. ఇది బృంద గానం, హరిహరి నారాయణా ఆది నారాయణా అనే పల్లవిని ప్రారంభిస్తారు.


మాల జంగాలు

TeluguVariJanapadaKalarupalu.djvu

మాల జంగాలనే పంచాలవారు మన బుర్రకథలనే ప్రత్యేక ఫక్కీలో చెపుతారు. వీరి తంబురా నెమలి ఈకలతో అలంకరింపబడి వుంటుంది. వీరి చేతి వుంగరాలతో తంబురా బుర్రను తాళ ప్రకారం మీటుతూ కథ చెపుతూ వుంటారు. ముఖ్యంగా వీరి కథలు కరుణరస ప్రధానమైనవి. వీరి ప్రదర్శనాలు సాయంత్రం ప్రారంభమై తెల్ల