పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/760

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారిని సర్కారాంధ్ర దేశంలో మాదిగవారంటారు. వీరు చెప్పులు కుట్టటంతో పాటు చర్మ కారులుగా వృత్తిని సాగిస్తారు. చాటింపు వేయడం, జాతర్లకూ, వుత్సవాలకూ డప్పు వాయిద్యాలను వాయించుట చేస్తుంటారు.

తెలంగాణాలో వున్న జోగువారు డప్పుల వాయిద్యంతో పాటు నైపుణ్యంగా నృత్యం చేస్తారు. వారి తెగలో ఎవరైనా మరణిస్తే వారిని శ్మశాన వాటికకు ఉత్సవంగా తీసుకుపోతూ డప్పుల వాయిద్యంతో నృత్యం చేస్తారు.

కేవలం నృత్యం చేయటమే కాక, నృత్యంతో పాటు గొల్ల కలాపంలో మాదిరి పిండోత్పత్తి క్రమాన్ని వివరంగా వివరిస్తారు. జీవుడు మాతృ గర్భంలో పిండోత్పత్తిలో ప్రవేశించింది మొదలూ నవమాసక్రమంలో పిండం యెక్క చలనాన్నీ అభివృద్ధిక్రమాన్ని వివరిస్తారు.

కేవలం చావు సందర్భాలలోనే కాక సంతోష సందర్బాలలో, వేడుకలలో, వివాహాలలో, ఉత్సవాల్లో కూడ ఈ జోగులవారు వారి డప్పుల నృత్య విన్యాసాన్ని ప్రదర్శిస్తారు. ఈ డప్పు వాయిద్యం చూపరులకు ఉత్తేజాన్ని కలుగజేస్తుంది.


కొలనుపాక, భాగవతులు

ఆంధ్ర ప్రాంతంలో వున్న గంటె భాగవతులకూ, తెలంగాణా గంటె భాగవతులకు వ్వత్యాసం వుంది. ఈ గంటె భాగవతులు కరీంనగర్ జిల్లా కొలనుపాకలో వున్నారు. వీరి ప్రదర్శనమూ రాత్రి పూటే జరుగుతుంది. వీరి ప్రదర్శన సాహిత్యం అంతగా తెలియక పోయినా, వీరి ప్రదర్శనం మాత్రం ప్రాముఖ్యంగా ప్రదర్శించటానికి ఈ గంటెలను ఉపయోగిస్తారు.

వీరి ప్రదర్శనంలో వచ్చే ప్రతి పాత్రధారి చేతిలోనూ ఒక గరిటె వుంటుంది. అందులో చమురు పోసి వత్తి వేసి వెలిగిస్తారు. ప్రతి పాత్ర యొక్క హావ భావాలూ, ఆంగిక చలనాలు, ఈ గరిటె వెలుతురు వల్ల ప్రేక్షకులకు విశదంగా వెల్లడౌతాయి. మధ్య మధ్య నటనను