పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/741

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాలరి నృత్యం

ఈ తరం వారికి తెలియని పడవ పాటలు, జాలరి పాటలు ఎన్నో వున్నాయి. ఇవి కంఠస్థంగానే తప్ప, ఏ గ్రంథంలోనూ పొందు పరచలేదు. నలభై సంవత్సరాల క్రితం వరకూ మన రవాణా అంతా నదుల ద్వారా, కాలువల్లో పడవల ద్వారా జరిగేది. ప్రయాణీకులు కూడ పడవలలోనే ప్రయాణం చేసేవారు. ఈనాడు రవాణా అంతా రైళ్ళ ద్వారా, లారీల ద్వారా జరగటంవల్ల పడవల రవాణా తగ్గి పోయింది. జాలర్లంతా ఈ పడవల ద్వారా జీవించేవారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పడవల రవాణా సాగుతూనే వుంది.

జాలర్ల పడవల్ని తెరచాపలు గట్టి గాలి వాటాన పడవల్ని నడిపేవారు. గాలి లేనప్పుడు పడవ సరంగులు పడవకు తాడుకట్టి కాలువ గట్టున నడుస్తూ లాగేవారు. బరువైన పడవల్ని అతి కష్టంగా అరుపులతో, కేకలతో పాటలతో పడవల్ని లాగేవారు.

పాటల్ని లయబద్ధంగా పాడుతూ తాళబద్ధమైన అడుగులతో పాటలు పాడుతూ తమ శ్రమనంతా మర్చిపోయేవారు. పల్లెల ప్రక్కగా ప్రవహించే ఈ కాలువల్లో పల్లెవారు పాడే పాటలు రాత్రింబవళ్ళూ అతి శ్రావ్యంగా వినిపించేవి. వీటిలో శృంగారంపాలు ఎక్కువగా వుండేది. ప్రకృతిని గురించీ, పరిసరాలను గురించీ, పాటలు పాడేవారు.

సంపత్కుమార్:

పడవసరంగులుగా, జాలరులుగా కొంత మంది వేషాలు ధరించి రంగస్థలం మీద జాలరుల వేషాలతో గడ పట్టి పడవ నడపటం, చుక్కాని పట్టటం, తెర చాప ఎత్తటం మొదలైన అభినయాలతో విద్యార్థులు మొదలైన వారు అక్కడక్కడ ప్రదర్శించేవారు.

కానీ ఈ జాలరి వేషాన్ని విజయనగరంకు చెందిన డి.వై.సంపత్కుమార్ తన నాట్య ప్రదర్శనలతో పాటు ఈ వేషాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి జాతీయ