పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/740

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పార్వతీ పుత్రుని పరమేశ్వరుని సూడ
ఎలుక వాహన మెక్కి వెళ్ళే తన వేడ్క
అమరంగ బెనకయ్యను ఆత్మలో తలచేరు
సంతోషమున కల్గు సకల జనులకును

అంటూ ఆందరి దేవుళ్ళనూ ప్రార్థించి, చౌడమ్మ కదిలే దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు పాట త్వర త్వరగా సాగుతుంది. అడుగులు త్వర త్వరగా వేయటం, గుండ్రంగా తిరగటం, జ్యోతి నెత్తుకున్న వ్వక్తి గిరగిరా తిరుగుతూ, కళ్ళు పెద్దవి చేసి చౌడమ్మలా కనిపిస్తాడు. తరువాత ఇలా పాడతాడు.

కదిలెను చౌడమయంత తోడను గాంభీర్య నాదములతో
రంతులునే మగరాడు చౌడమ రానువు కదిలెను రమ్యముతో
ఎప్పుడు మనకు ఇచ్చిన వరములు యే కొదువా లేదు
తప్పక కొలవండి దారుని లోపల దైవంబసలే చౌడమ్మ.

ఇలా చౌడమ్మ గూర్చి, ఆమె గొప్ప తనాన్ని గూర్చి వేనోళ్ళ పొగుడుతూ అనేక గేయాలు పాడతారు.

రక్తపు బొట్టు:

జ్యోతి నృత్యం చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ నడి బజార్లో వెళుతూవుండగా భక్తులు ఆమెకు జంతు బలుల్ని ఇస్తూ వుంటారు. ఆ చౌడమ్మ దేవతను రక్తపు బొట్టుతో అలంకరిస్తారు. ఒకరే ఒక్క వేటుతో పొట్టేలు తలను నరుకుతాడు. క్రిందబడిన రక్తం దాటుకుంటూ జ్యోతి వెళుతూవుంటుంది. చివరికి దేవతలనూ, చౌడమ్మను స్తుతిస్తూ మంగళం పాడతారు.

జ్యోతి నృత్యాన్ని చూస్తున్న శ్రోతలు రెండు చేతులెత్తి మ్రొక్కటం, భక్తితో ఇంటి దగ్గరకు వెళ్ళేటప్పుడు టెంకాయలు కొట్టి ఎవరికి వారు బలి ఇస్తారు. స్త్రీలు, పురుషులూ కూడ గుంపుతో కలిసి నృత్యం చేస్తారు. 'చౌడమ్మా' అంటూ బిగ్గరగా అరుస్తూ చేతులెత్తి మ్రొక్కుతారు. ఇలా నృత్యం చేసే గ్రామాలు__ ధర్మవస్రం, రేగాటి పల్లె, పెద్దకోట్ల, డా॥ బిగిచర్ల కృష్ణారెడ్డిగారి సౌజన్యంతో (జానపద నృత్యకళ నుండి)