పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/735

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మాత్రం ఈ విలువిద్యా ప్రదర్శనాలు ఎక్కడా ప్రదర్శిస్తున్నట్లు మనకు దాఖలాలు కనిపించవు. కారణం విలువిద్య చాల కష్టమైంది. ఎంతో సాధన చేస్తే గానీ అలవడని విద్య. గిరిజనులు తమ బిడ్డలకు చిన్నతనం నుంచే విలువిద్యను నేర్పుతారు. ఎందుకు? ఒక ప్రక్క మాంసాహారం కోసం, జంతువుల వేటకూ, క్రూర మృగాల ప్రమాదాల నుంచీ తప్పించుకోవడానికీ విలువిద్యను ఎంతో భక్తి శ్రద్ధలతో గురువు వద్దనే నేర్చుకుంటారు. ప్రతి తండ్రీ తన బిడ్డకు విలువిద్యను నేర్పుతాడు.

TeluguVariJanapadaKalarupalu.djvu

అయితే ఆంధ్రదేశంలో మచ్చుకు అక్కడక్కడా ఈ విలువిద్యా ప్రదర్శనలో నిపుణులైన ఆ తరానికి చెందిన వృద్ధులు కొందరు కనిపిస్తారు. అలా పశ్చిమ గోదావారి జిల్లాలో ఇంకా ఈ విలువిద్య బ్రతికేవుంది. ఈ విద్యను పెంచి పోషించిన వారూ, ఈ నాటికీ బ్రతికిస్తున్న వారూ క్షత్రియులైన రాజులు.

వారి పేరైతే నాకు తెలియదు కాని ఆయన ప్రదర్శించిన విలువిద్యా ప్రదర్శనను మద్రాసు, 'సెంటనరీ హాలు ' లో "కళాభారతీ" వార్షికోత్సవం సందర్భంలో చూచి ఆశ్చర్యపోయాను. కను చూపు తగ్గిపోతూ వున్న డెబ్భైమూడు సంవత్సరాల వయస్సులో ఆయన ప్రదర్శించిన ప్రదర్శనమది. అది ఒక అద్భుత ప్రదర్శనం. అపూర్వ ప్రదర్శనా నిదర్శనం. హాజరైన మూడు వేల మంది ప్రేక్షకులూ ఆశ్చర్యానందంలో మునిగి పోయారు. ఈ రోజుల్లో ఇంతటి విలువిద్యా నిపుణులున్నారా? అని విస్తు పోయారు. వేనోళ్ళ పొగిడారు. తమ తమ అభినందనాలను తెలియజేసుకున్నారు.

ఇంతకీ ఆ అద్భుత ప్రదర్శనం:

ఇంతకీ ఆ అద్బుత ప్రదర్శనం ఏమిటి? పైకి వ్రేలాడదీసిన చేప ప్రతి బింబాన్ని క్రింద పళ్ళెంలో వున్న నీళ్ళలో పైన వ్రేలాడ దీసిన చేప ప్రతి బింబాన్ని చూచి విల్లు పైకి సూటిగా వెక్కు పెట్టి అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టినట్లు ఒక దెబ్బతో పైన వ్రేలాడదీసిన పండును కొట్టాడు రాజుగారు. హాలంతా కరతాళ