పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/736

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధ్వనులతో దద్దరిల్లి పోయింది. అలా అర్జునుడు కొట్టాడనుకున్నారు. కాని రాజుగారు కొట్తగలరని ఎవరనుకున్నారు? ఇదీ రాజుగారి అపార విలువిద్యా ప్రదర్శన.

అలాగే కళ్ళకు గంతలు కట్టుకుని దూరంగా ఒక మనిషిని నిలబెట్టి అతని చేతికి దారంతో వ్రేలాడ గట్టిన నిమ్మ పండు అతని చేతికిచ్చి అటూ ఇటూ ఊపుతున్నాడు. అలా వూపుతున్న దారాన్ని రాజు గారు అంబుతో తెగ గొట్టాడు. పండు క్రిందకి పడింది.

అలాగే నాలుగు నిమ్మ పండ్లకు దారాలు కట్తించి, గుండ్రంగా త్రిప్పమన్నాడు. త్రిప్పుతూ వుండగా అంబుతో నిమ్మపండ్లు కట్తిన నాలుగు దారాలను ఒక్క దెబ్బతో తెగ గొట్టాడు. నాలుగు నిమ్మ పండ్లూ నేలమీద పడ్దాయి.

అలాగే కండ్లకు గంత కట్టుకున్న మరో ప్రదర్శన దూరంగా ఒక బల్ల చెక్కను నిలబెట్టి ఆ చెక్క మీద గుండ్రని కాగితాన్ని అంటించి, దాని ప్రక్కన చిన్న పుల్లతో శబ్దం చేయమన్నాడు. ఆ శబ్దం ఎక్కడ నుంచి వస్తూ వుందో దానిని గమనించి అంబును వదిలాడు. అది సూటిగా వెళ్ళి బల్ల చెక్క మీద అంటించి వున్న కాగితం మధ్యలో నాటుకుంది. ఇది శబ్ద భేది అని మన పురాణాల్లో విన్నాము.

ఎన్నో అద్భుతాలు:

అలాగే నిలబడి వున్న మనిషి తలమీద నిమ్మ పండు వుంచి మనిషికి ఏ ప్రమాదమూ లేకుండా తల మీద నున్న నిమ్మపండుకు అంబును నాటటం.

అలాగే ఒక గోడకు ఒక బల్ల చెక్కను ఆనించి, ఆ చెక్క ముందు మనిషిని నిలబెట్టి కళ్ళు మూసుకుని నుంచున్న మనిషి చుట్టూ బల్ల చెక్కకు బాణాలు సంధించడం.

అలాగే అంబు వేగాన్ని తగు మోతాదులో సందించటం. మరో అద్భుత ప్రదర్శన. మనిషి నుదుటికి ఒక రూపాయి అంటించి రాజు గారు నాలుగు గజాల దూరంలో నిలబడి నొసటి మీద రూపాయి నుంచుకున్న మనిషికి ప్రమాదం లేకుండా ఆ రూపాయిని తగు మోతాదులో బాణాన్ని సంధించి దానిని పడగొట్టటం.

అలాగా నాలుగు గజాల దూరంలో నిమ్మ పండు కట్టిన దారం పుచ్చుకున్న ఒకే మనిషిని నిలబెట్టి తాను వెనుకకు తిరిగి విల్లు వీపు వెనుక సరిగా వెక్కు పెట్టి, ఆ దారాన్ని తెగగొట్టటం.