చెందిన విలుకాండ్రు పేరు చెప్పి ఒక్క దెబ్బతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నారు.
- ఆనాటి ఆదరణ:
ఒకనాడు ఈ విలువిద్యను ఆహారం కోసం జంతువులను వేటాడే సాధనంగా కాక నైపుణ్యంతో కూడిన కళగా తీర్చి దిద్దారు. ఈ నాతికీ ఈ కళ జాతీయంగానూ, అంతర్జాతీయం గానూ క్రీడల పోటీలలోనూ ప్రవేశపెట్టారు. అధునిక ప్రపంచంలో, ప్రపంచ వ్వాత్పంగా ఈ విలువిద్య ఈ నాటికీ ఎంతో ప్రఖ్యాతి వహించింది.
ఒకనాడు ఆంధ్రదేశంలో రాజులూ, జమీదారులూ, ఈ విలువిద్యా ప్రదర్శనలను ఎంతగానో పోషించారు. వారి సమక్షంలోనే పోటీలను నిర్వహించారు. ఉత్తమ విలుకాండ్రకు ఉత్తమ బహుమానాలను బహూకరించేవారు.
ఈ పోటీలకు ఎక్కెడెక్కడ విలుకాండ్లందరూ పోటీలకు తయారై వచ్చేవారు. ప్రజలు ఈ ప్రదర్శనాలను చూడటానికి తండోప తండాలుగా వచ్చి విలువిద్యా ప్రదర్శనలు చూచి నివ్వెరపడిపోయేవారు. ప్రదర్శనాలను చూచి వెళ్ళిన యువకులూ బాలురూ విల్లంబులను తయారు చేసుకుని పిట్టల్నీ వేటాడేవారు.
- ప్రజలను అలరించింది:
అలాటి ఈ ధనుర్విద్యా ప్రదర్శన కళ, జానపద కళగా అభివృద్ధి చెందింది. అన్ని కళారూపాలతో పాటు ప్రజలను రంజింప చేసింది. అలాంటి ఈ కళారూపం శిధిలమై కనుమరుగై పోతూ వుంది.ఈ నాడు కనుమరుగై పోతున్న అన్ని జానపద కళారూపాలతో పాటు విలువిద్యా ప్రదర్శనలు కూడ కాలగర్భంలో కలిసిపోతూ వున్నాయి.
ఈనాటి యువతరానికి రాముడో, ద్రోణాచార్యుడో బాణాలు సంధించారనీ, యుద్దాలు చేసారనీ టి.వి.లో చూడటమేకాక, ఒక నాడు ఆంధ్రదేశంలో ఈ వులువిద్యలో ఆరితేరిన నిపుణులున్నారనీ, అత్యద్భుతంగా ప్రదర్శనాలు ప్రజామోదం పొందాయన్న విషయం చాల మందికి తెలియదు. తెలుసుకోవాలనుకునే వారూ లేరు.
- అడవి జాతుల వారే ఆరాధిస్తున్నారు:
వారి వారి అవసరాల కోసం, జీవనాధారం కోసం అక్కడక్కడ అడవులలో వున్న గిరిజనులలో మాత్రమే ఈ విలువిద్య బ్రతికివుందే తప్ప, ఆంధ్రదేశంలో