పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/733

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిమ అడవి జాతులుగా పిలువబడి ఈ నాటికీ అడవుల్లో నివశించే గిరిజన జాతుల వరకూ అందరూ విల్లుపట్టి ఆరితేరినవారే. ద్రుపదుని కొలువులో మత్స్యయంత్రాన్ని కొట్టిన అర్జునుడూ, శివధనుస్సును విరిచి సీతను పెళ్ళాడిన రాముడూ, రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద విలువిద్యను నేర్చినవారే, విలువిద్యను నేర్చిన రాముడు రాక్షసులైన మారీచు

సుభాహులను, మాయ లేడిని, చెట్టు చాటునుండి వాలినీ చివరికి రావణునీ వధించింది విలువిద్యతోనే. రామరావణ యుద్ధం ముగిసింది మారణాస్త్రాలతోనే.

ద్రోణాచార్యుల వద్ద కౌరవ పాండవులందరూ విలువిద్యను నేర్చినవారే అందరూ విల్లును పట్టి ఒకరి నొకరు వధించుకున్నవారే. విలువిద్యలోనే గురువును మించిన శిష్యుడనిపించుకున్నాడు ఏకలవ్యుడు.

ఒక్క మాటలో చెప్పాలంటే మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తన విల్లుతో, విల్లంబుల సైన్యంతో, గడగడ లాడించి తుపాకులకు ఎదురు నిల్చి, విల్లుతో ఎందరినో హతమార్చాడు.

కనుమరుగౌతున్న కళ:

ఇలా చెప్పుకుంటూ పోతే ఏ దేశ చరిత్రలో చూచినా మందు గుండూ, మారణాయుధాలు లేని నాడూ, అందరూ విల్లును బట్టి ఆహారాన్ని సంపాదించుకున్న వారే. విల్లుతో విరోధుల్ని, ఎదుర్కొన్నవారే. తుపాకి పట్టిన వారికి ప్రప్రథంమంగా గురి చూసి కొట్టడం నేర్పింది విల్లే. అలాంటి విలువిద్య నాగరిక ప్రపంచంలో నానాటికీ కనుమరుగై పోయింది. కేవలం వైరుల నెదిరించటానికే కాకుండా, అదొక నైపుణ్యంగల ఉత్తమ కళారూపంగా కూడా అభివృద్ధి చెందింది. ఈ నాటికీ కోయలు, చెంచులు, సవరలు, జాతాలు, కొండ రెడ్లు, గోడులు మొదలైన అడవి జాతులకు