ఈ పుట ఆమోదించబడ్డది
కోర మీసాలు ధరించి మెడలో ఫకీరు పూసల దండను వేసుకుంటారు. ఎర్రని రిబ్బన్ తలకు కట్టుకుంటారు. ముంజేతికి ఇత్తడి గాజులు ధరించి చేతిలో ఒక పొట్టి కర్రను దండంగా ఉపయోగించి, గాజులున్న చేతితో పట్టుకుని ఆ కఱ్ఱతో గాజులను తాళంగా కొడుతూ లయ తప్పకుండా ఒకరి తరువాత ఒకరు గానం సాగిస్తారు.
కుడిచేతితో గాజులు కొడుతూ ఏడమ చేతితో రుమాలును వూపుతూ, అదే చేతితో మీసాన్ని మెలివేస్తూ, ప్రజలను ఉత్తేజపరుస్తూ, ఉత్సాహపరుస్తూ పాటలను పాడుతారు. లేదా అమ్ములు ధరించి కోయవేషంతో ప్రదర్శిస్తారు.