Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/729

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండిగా ప్రచారమైన దండా గానం

దండా గానమనేది ఇతర ఆంధ్ర జిల్లాలలో ఎక్కడా ప్రచారంలో లేక పోయినా తెలంగాణా ప్రాంత పల్లె ప్రజలలో మాత్రం బాగా ప్రచారంలో వుంది.

దండా గానమనేది అల్లాకేనాం అంటూ పాడే ఫకీర్ల పాటకన్నా కొంత భిన్నంగా వుంటుందనీ, అందులో ఉరుదు పదాలు, ఉరుదు భాషోచ్ఛారణా తక్కువగా వుంటుందనీ జయధీర్ తిరుమల రావు గారు తమ ప్రజా కళారూపాల గ్రంధంలో వివరిస్తూ, ఈ పాటల్లో మొత్తం తెలంగాణాలో జరిగిన వీరోచిత పోరాటాల చరిత్ర వస్తుందనీ, ఐతే నైజాంలో ముఖ్యంగా పోలీసు చర్య తరువాత ప్రజాజీవితంలో వచ్చిన మార్పుల్నీ వారి ఆశయాలనూ, అభిశంసలను ఈ గానంలో ప్రతి బింబించారనీ వ్రాశారు.

ఫకీర్ల పాటల్లో కనిపించే సాధారణ పదాలు ఇందులో వుండవు. అయితే తెలంగాణా ప్రజా పోరాట కాలంలో దీనిని ఒక పెద్ద కళారూపంగా మలిచారు. అలాగే పారంపర్యంగా వస్తున్న దండా గాన కళా రూప స్వభావాన్ని కొంత మార్చటం కూడా జరిగిందంటారు తిరుమల రావుగారు.

పాటల్లో ప్రజలను ఉత్తేజ పర్చటానికి మీసాన్ని మెలివేయటం ఆవేశంతో హావభావాలను చూపించడం జరుగుతుంది.

కళారూపంలో తెచ్చిన మార్పు:

ఫకీరు పాటలకు ప్రధానమైన 'అల్లాకేనాం' అనే పల్లవినే ఈ పాటల్లో పరిహరించారు. ఉరుదు భాష ఉచ్ఛారణను తీసి వేశారు.

అందువల్ల ఈ దండా గాన కళా రూపాన్ని, అమ్ములు ధరించిన కోయ వేషాలతో ప్రదర్శించారని సుద్దాల హనుమంతు తెలిపారు.

దీనిని ప్రదర్శించటానికి ఇద్దరు వ్వక్తులుంటే చాలు. వారు ఎర్రని లుంగీలు ధరించి నల్ల బనీన్లు తొడుక్కుని మోకాలి వరకు వ్రేలాడే పంచెను నడుముకు కట్టి,